నితిన్-ఇలియానా ఎడారి కష్టాలు
దర్శకుడు పరుచూరి మురళీ, జి.వి రమణ నిర్మాణంలో శ్రీ సెక్ట్రా మీడియా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'రెచ్చిపో" నితిన్, ఇలియాన కాంబినేషన్ లో వస్తున్న మొదట అవడంతో దర్శకనిర్మాతాలు ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకొన్నారు. దానికి తగ్గట్టుగా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్యేశంతో హీరో నితిన్, అందల ఖజానా ఇలియానా ఎంతో పట్టుదలో చాలా కష్టపడుతున్నారని యూనిట్ వర్గాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు 'రెచ్చిపో" సినిమా గురించి మాట్లాడుతూ సినిమా కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్దమౌతోందని ఇందులో ప్రియుడి ప్రేమకోసం ప్రియురాలి పాత్రలో ఇలియానా 'రెచ్చిపో"యిందన్నారు. రెండు నెలలుగా దుబాయ్ ఎడారిలో నితిన్, ఇలియానాలతో చిత్ర పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నామన్నారు. ఈ సినిమాలో నితిన్ యాక్షన్ తో పాటు ఇలియానా అందచందాలు ప్రధాన ఆకర్షనగా నిలుస్తాయి అని చెప్పారు. మరి ఈ ఎడారి కష్టాలకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో వేచిచూడాలి. సో బెస్ట్ విషెష్ నితిన్.


Click it and Unblock the Notifications











