Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న 'భరత్ అనే నేను': మహేష్ నిర్మాతల పంట పండినట్లే..
Recommended Video
వరుసగా రెండు డిజాస్టర్లు వచ్చినా.. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏమాత్రం తగ్గలేదు. సరికదా.. తన గత సినిమాల కన్నా 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ బిజినెస్ లో చాలా ముందుంది. మహేష్-కొరటాల శివ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో రికార్డు ధరకు శాటిలైట్ రైట్స్, అలాగే ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోయాయి. దీంతో నిర్మాతలకు ఇప్పటికే 75% ఇన్వెస్ట్ మెంట్ రికవరీ అవడం విశేషం..
మహేష్-బన్నీ కాంప్రమైజ్!: ఎవరు ముందు?.. ఇదీ డీల్..
ప్రీ-రిలీజ్ బిజినెస్:
మహేష్-కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 'భరత్ అనే నేను'పై కూడా అదే రకమైన అంచనాలున్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. సినిమా బాగా వస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో.. ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందంటున్నారు.
శాటిలైట్ రైట్స్.. సరికొత్త రికార్డు:
ప్రీరిలీజ్ బిజినెస్‌లో భాగంగా.. నిర్మాతకు ఇప్పటికే 75శాతం వరకు ఇన్వెస్ట్ మెంట్ రికవరీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా ఆడియో రైట్స్ ను ఇటీవలే లహరి మ్యూజిక్ కంపెనీ దక్కించుకుంది. తాజాగా సినిమా శాటిలైట్ హక్కుల కోసం స్టార్ మా చానెల్ ఏకంగా రూ.39కోట్లు వెచ్చించినట్లు సమాచారం.
మహేష్ బాబు కెరీర్లో టాప్..;
శాటిలైట్ రైట్స్ పరంగా మహేష్ బాబు కెరీర్ లో 'భరత్ అనే నేను' టాప్ లో నిలుస్తుందని చెప్పాలి. అన్ని భాషల్లో కలిపి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం స్టార్ మా రూ.39కోట్లు చెల్లించింది. నిజానికి ఇదంతా వట్టి ఊహాగానమే అనుకున్నప్పటికీ.. ఇదే నిజమైనట్లు తెలుస్తోంది.
నిర్మాతలకు ప్రాఫిట్;
ఇక డిజిటల్ రైట్స్‌ను ఆమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఇందుకు గాను భారీ మొత్తంలోనే డీల్ కుదిరినట్లు సమాచారం. ఇప్పటికే 75శాతం రికవరీ కావడంతో.. ఇక సినిమా విడుదలైతే వచ్చే కలెక్షన్ అంతా లాభాల కిందకే వస్తుందంటున్నారు.
పాజిటివ్ టాక్ వస్తే పండగే..:
సినిమాకు పాజిటివ్ టాక్ గనుక వస్తే నిర్మాతల పంట పండినట్లే. ఇక బ్లాక్ బస్టర్ టాక్ గనుక వస్తే సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం కూడా ఖాయమనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ లో సినిమా విడుదలకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.