బన్నీ కెరీర్ లోనే హయ్యెస్ట్: 'నాపేరు సూర్య' శాటిలైట్ రైట్స్ ఎంతకు కొన్నారో తెలుసా?
Recommended Video

అల్లు అర్జున్ కెరీర్‌లో 'నా పేరు సూర్య' సినిమా టాప్‌లో నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే దమ్మున్న సినిమా అన్న అభిప్రాయం కలిగేలా చేయడంలో దర్శకుడు వక్కంతం వంశీ సక్సెస్ అయ్యాడు. ట్రైలర్ తోనే ఇంతలా ఆకట్టుకున్న ఈ సినిమా నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే 'నాపేరు సూర్య' హయ్యెస్ట్ శాటిలైట్ రైట్స్ కు అమ్ముడుపోవడం విశేషం.

బన్నీ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్:
'నాపేరు సూర్య' శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.24. 7కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ రూ.15కోట్లు చెల్లించి జీ-తెలుగు సొంతం చేసుకుంది. ఇతర భాషల శాటిలైట్స్ కూడా కలుపుకుని రూ.24.7కోట్లకు అమ్ముడుపోయింది.

దుమ్ము రేపిన టీజర్:
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తొలి 24గం.ల్లోనే కోటికి పైగా వ్యూస్ సాధించింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో.. విపరీత ఆవేశం ఉన్న సైనికుడిగా అల్లు అర్జున్ పాత్ర అన్ని వర్గాలను ఆకట్టుకుంది.

వంశీని మెచ్చుకోవాల్సిందే:
టీజర్ చూశాక దర్శకుడు వక్కంతం వంశీ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. ఇన్నాళ్లు కథా రచయితగానే తెలిసిన వంశీలో ఇంత అద్భుతమైన డైరెక్టర్ దాగున్నాడా? అనిపించేలా 'నాపేరు సూర్య'ను పిక్చరైజ్ చేశారాయన. హీరో క్యారెక్టరైజేషన్ పరంగా.. టేకింగ్ పరంగా.. వంశీకి ఇప్పటికే ఫుల్ మార్క్స్ పడిపోయాయి.

రికార్డులు తిరగరాస్తుందా?:
విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తున్న 'నాపేరు సూర్య' ఇక విడుదలయ్యాక రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అన్న అంచనాలు ఉన్నాయి. ప్రత్యేకించి బన్నీ ఫ్యాన్స్‌కు నిజంగా ఇదో పండుగ లాంటి సినిమా కాబోతుందని అంటున్నారు. సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి.. 2018లో బన్నీ చేసే మ్యాజిక్ ఎలా ఉండబోతుందో!


Click it and Unblock the Notifications











