ఖమ్మం జిల్లా నక్సలైట్స కథతో భారీ హిందీ చిత్రం

By Srikanya

మన కథ,నేపధ్యం,సమస్యతో ఓ హిందీ చిత్రం రూపొందింది. రెడ్‌ అలర్ట్‌-ది వార్‌ విత్‌ ఇన్‌' అనే హిందీ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా మూలకథను అందజేయడం విశేషం. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఈ చిత్ర కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు అనంత్‌ మహదేవన్‌. మావోల కదలికల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది.ఈ చిత్రంలో నక్సలైట్స్ సమస్యలు,ప్రభత్వ చర్యలు,టెర్రరిజం అనే విషయాలు చుట్టూ కథ సాగుతుంది. నరసింహ అనే ఓ పేద వంటవాడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటించారు.కథ ప్రకారం నరసింహం తన పిల్లాడి చదువుకోసం డబ్బు అవసరమై నక్సలైట్ ఉద్యమంలో ఇరుక్కుంటాడు. మొదట్లో వంటవాడిగా ఉన్నా ఆ తర్వాత వెపన్స్ ట్రైనింగ్, కిడ్నాప్ లు వంటివి చేయాల్సి వస్తుంది.

అయితే ఆ నక్సలైట్ లీడర్(ఆశిష్ విద్యార్ధి)తో తగువు వస్తుంది. అయితే అనుకోని పరిస్దితుల్లో తన చేతులోకి మొత్తం గ్రూప్ ని తీసుకుని నడిపించాల్సి వస్తుంది. అప్పుడు అతను వెనక్కి వచ్చి తన కుటుంబంతో ఉన్నాడా లేక ఉద్యమాన్నికొనసాగించాడా అన్న విషయాలతో కథనం ఆసక్తి కరంగా నడుస్తుంది. ఇక ఈ చిత్రంలో సీమా బిశ్వాస్‌, నసీరుద్దీన్‌ షా, వినోద్‌ ఖన్నా తదితరులు కీలక పాత్రధారులు. సునీల్‌ శెట్టి మాట్లాడుతూ ''ఈ సినిమాలో నా పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. చాలా హోమ్‌ వర్క్‌ చేశాను. నాకు తెలిసి మావోయిస్టులు దేశం మీద పోరాడటం లేదు. వారికి వ్యవస్థ మీద అసంతృప్తి ఉంది. ఉగ్రవాదం వేరు... నక్సలిజం వేరు.. ముందు మన దగ్గర ఉన్న నక్సలిజం సమస్యను పరిష్కరించుకొంటే తరవాత ఉగ్రవాదుల గురించి ఆలోచించవచ్చన్న సందేశం ఇందులో ఇచ్చామ''న్నారు. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X