‘మగధీర’ను డిస్ట్రిబ్యూట్ చేయనున్న రెడ్ గైంట్స్ మూవీస్...
తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసి, మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ అంతటినీ ఒక్కసారి తలతిప్పి తెలుగు పరిశ్రమవైపు చూసేలా చేసిన 'మగధీర" దాదాపు 70కోట్ల షేర్ వసూలు చేసింది. నిజానికి ఈ షేర్ కి మరో నాలుగైదు కోట్లు యాడ్ అయి ఉండాల్సింది. లేదా ఓవరాల్ గా వచ్చిన రాబడికి మరో ఏడెనిమిది కోట్టుయ కలిసుండాల్సింది. రెండు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో విడుదలై సంచలనం సృష్టించిన రామ్ చరణ్ చిత్రం మగధీర ఇప్పుడు తమిళ, మలయాళ బాషల్లో విడుదలకు సిద్దమవుతుంది. రామ్ చరణ్, రాజమౌళికి తమిళంలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాని అక్కడ కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా తమిళంలో ఎప్పుడో విడుదల కావాల్సింది. కాని కొన్ని కారణాల వలన ఆగిపోయింది. తెలుగు మగధీర అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.
'మావీరన్' చిత్రానికి సంబందించిన సినిమా పోస్టర్స్ ను మంగళవారం విడుదల చేసారు. ఈ చిత్రాన్ని చెన్నైలో విడుదల చెయ్యడానికి గీత ఆర్ట్స్ చెన్నై లోని రెడ్ గైంట్ మూవీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మే మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'రోబో" రాకముందు ఔరా అనిపించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల్ని మెప్పించగలదా? అసలు ఒక తెలుగు సినిమాని డబ్బింగ్ చేసి తమిళంలో విడుదల చేయడానికి ఇంతకాలం నాన్చడం అవసరమా? తమిళ మగధీరుడి ముందు చాలా సవాళ్లున్నాయి.


Click it and Unblock the Notifications











