twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించేనా రామ్ గోపాల్ వర్మ అన్నది?

    By Srikanya
    |

    వివాదమే ఇంటిపేరుగా మార్చుకున్న వర్మ తాజాగా రెడ్డి గారు పోయారు అనే టైటిల్ ప్రకటించి సంచలనం రేపే ప్రయత్నం చేసారు. ఇది ఓ పొలిటకల్ డ్రామా అని ...ప్రస్తుత రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెప్పారు. అలాగే తాను ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ డ్రాఫ్ట్ స్క్రిప్టు పూర్తి చేసానని, ప్రి ప్రొడక్షన్ కి రెడీ అవుతున్నానని అన్నారు. దొంగలముఠా చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నేఫద్యంలో ఆ టాపిక్ ని ఏమార్చటానకి ఈ టైటిల్ ని హడావిడిగా ప్రకటించాడా అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయాల నేఫధ్యంలో కుర్చీ , రాజకీయం అనే చిత్రాలు చేస్తానని వర్మ గతంలో ప్రకటించారు.

    కానీ ఆ సినిమాలు ఏమీ ఇంకా మొదలపెట్టలేదు. అలాగే పూరీ జగన్నాధ్, హరీష్ శంకర్ లతో మరో ప్రక్క వాంటెడ్ చిత్రం దర్శకుడు బి.వియస్ రవి ని హీరోగా పెట్టి పెళ్ళి చిత్రం చేస్తున్నారు. ఇంతకీ రెడ్డిగారు పోయారు అంటే దానర్ధం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణించాక అనేనే కాదా అన్నది అన్ని వర్గాల్లోనూ ఆసక్తి రేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల చుట్టూనే ఈ కథ జరుగుతుందా అనేది అన్ని వర్గాల్లోనూ అప్పడే ఛానెల్స్ వారు చర్చమెదలెట్టాసారు.

    English summary
    Ram Gopal Varma new Telugu movie is Reddy Garu Poyaru. However, Reddy Garu Poyaru is only tentatively titled . So by the looks of Ram Gopal Varma's new title Reddy Garu Poyaru, we can clearly draw a conclusion that this movie is based on contemporary politics surrounding Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X