twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు ప్రేక్షకుల్ని వదిలే ప్రసక్తే లేదు: రామ్ గోపాల్ వర్మ...?

    By Sindhu
    |

    బాలీవుడ్ లో జెండా ఎంతేసి, టాలీవుడ్ కి మకాం మార్చుకున్న రామ్ గోపాల్ వర్మ..ఇప్పట్టో తెలుగు ప్రేక్షకులను వదిలే ప్రసక్తే లేదని అంటున్నాడు. ఒకప్పుడు తెలుగు సినిమానే చేయనని స్టేట్ మెంట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పడు కేవలం తెలుగు సినిమాలే శరణ్యమంటున్నాడు. పరిటాల రవి జీవిత కథ ఆధారంగా రక్తచరిత్ర 1,2లను తెరకెక్కించి ఆ నేపథ్యాన్ని క్యాష్ చేసుకున్న వర్మ ఇటీవలే కెయస్ డి అప్పల్రాజు, దొంగలముఠా సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులతో ఖంగుతిన్నాడు. అయినా వర్మ వాటిని కూడా తనకొచ్చిన పబ్లిసిటీగానే భావిస్తున్నాడు.

    రామ్ గోపాల్ వర్మ తన తాజా ప్రయోగాత్మకంగా తీసిన 'దొంగల ముఠా' సినిమాకి రెస్పాన్స్ ఏమీ కనిపించడం లేదని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో వర్మ మరో ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రం పేరు 'రెడ్డి గారు పోయారు'! ఇది వినగానే మనకు వెంటనే స్పురించే వ్యక్తి వై.యస్.రాజశేఖర్ రెడ్డి. అవును... ఆయన జీవితం ఇన్స్ పిరేషన్ తోనే ఈ చిత్రాన్ని వర్మ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. రాజకీయ నేపథ్యాన్ని ఎంచుకొని దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను ప్రస్తుతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంచితే, 'దొంగల ముఠా' ఒక్క రోజు ఆడినా చాలు.. సూపర్ హిట్టే అని ముందే చెప్పిన వర్మ ఇక ఆ సినిమా గురించి డిస్కషన్ కి ఇష్టపడడం లేదు!

    English summary
    Ram Gopal Varma doesn’t bother a bit about the flak that his latest release Dongala Muta has been receiving. He says that it is a huge hit for its budget and has already moved on to his next. He is making a film on politics and political conspiracies which is tentatively titled Reddy garu Poyaru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X