Don't Miss!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా డ్యామేజీ కాని ఫోన్ ధర తగ్గింపు.. 108MP కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వివాదాల్లో క్విక్ గన్ మురగన్
క్విక్ గన్ మురుగన్ ఇప్పుడు సినీ ఇండస్టీలో భారీ అంచనాలతో విడుదలకు సిద్దమౌతున్న కామెడీ చిత్రం. ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు , నాలుగు భాషల్లోరూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో సౌత్ ఇండియన్ కౌబాయ్‌గా స్టార్ కామెడీ హీరో రాజేంద్రప్రసాద్ సూపర్ హీరోగా...అందాల భామ రంభ హీరోయిన్గా నటించారు. ఈ మూవీతో మ్యాంగో డాలీ పాత్రలో ఆరేళ్ల తర్వాత బాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తోంది రంభ. ఇంగ్లీష్, హిందీ, తమిళ మూడు భాషల్లో ఈ సినిమా ఈ రోజు విడుదలౌతోంది. ఓం శాంతి ఓం లో షారుక్‌ఖాన్ యాడ్ కోసం చేసిన మైండ్ ఇట్, మై నేమ్ ఈజ్&మురుగన్ క్యారెక్టర్ ఇంప్రెషన్‌తో వస్తున్న చిత్రం క్విక్ గన్ మురుగన్. షారుక్ ట్రైలర్...దనాధన్ ధోనీ యాడ్...నసీరుద్దీన్ కౌబాయ్ రోల్...రజినీకాంత్ స్టైల్...కలగలిపి వస్తున్న మసాలా మూవీ క్విక్ గన్ మురుగన్. ఓం శాంతి ఓం లో షారుక్ ప్లే చేసిన తమిళ్ షేడెడ్ మై నేమ్ ఈస్ మురుగన్ కు కార్బన్ కాపీ.
కామెడీ ప్రధానాంశంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న క్విక్‌గన్ మురుగన్ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని దృశ్యాలు తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని రెడ్డి కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్స్ విషయానికి వస్తే...హీరో రాజేంద్ర ప్రసాద్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఓనర్. ఇడ్లీ సాంబార్ బ్రాండ్ అంబాసిడర్. పక్కా వెజిటేరియన్. నాన్ - వెజ్ దోసా మేకర్& రైస్ ప్లేట్ రెడ్డి విలన్. సాదా సీదా ఉండే మురుగన్...గన్నెందుకు పట్టాడనేది అసలు ట్విస్ట్.
అయితే ఈ సినిమాపై రెడ్డి సంఘాలు అభ్యంతరం చెప్తున్నాయి. తమ&మనోభావాలు దెబ్బతీసే విధంగా సీన్లు వున్నాయని& అంటున్నాయి. ఇదిలావుంటే ఈ సినిమా స్పెషల్ షో చూసిన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్...మూవీపై&ప్రశంలజల్లు కురిపించాడు. ఈ మూవీకి డానియల్ జార్జ్, సాగర్ దేశాయ్, రఘు దీక్షిత్ లు సంగీతాన్ని సమకూర్చగా, అంకుర్ తివారి లిరిక్స్‌ని అందించారు. ఇప్పటికే సక్సెస్ అయిన ఈ మూవీ ఆడియోలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ 'మికా" పాడిన పాట హైలెట్‌గా నిలిచింది. శశాంక్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న క్విక్ గన్ మురుగన్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికౌవడం విశేషం.