తెలుగు తెరకు రీమా సేన్ సోదరి దీషా సేన్
తన సోదరి దీషా సేన్ ను తెలుగు తెరకు పరిచయం చేసే ప్లాన్ లో హీరోయిన్ రీమా సేన్ ఉందట. అవకాశాలు లేక సతమతమవుతున్న రీమా సేన్ ఇక సోదరి సినీ జీవితంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. యుగానికి ఒక్కడు సినిమా తర్వాత రీమా సేన్ కు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. శుక్రవారం తన బర్త్ డే పార్టీకి రీమా సేన్ టాలీవుడ్, కోలివుడ్ పెద్దలను ఆహ్వానించింది. హైదరాబాదు నుంచి ఓ ఇద్దరు నిర్మాతలు ముంబైలో జరిగిన రీమా సేన్ బర్త్ డే ఫంక్షన్ కు హాజరయ్యారు. రీమా సేన్ తన సోదరి దీషా సేన్ వారికి పరిచయం చేసి, తెలుగు తమిళ సినిమాల్లో నటించడానికి ఇష్టపడుతోందని చెప్పిందట. నిర్మాతలు కూడా దీషా సేన్ అందానికి మురిసిపోయారని అంటున్నారు. ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారని వినికిడి.


Click it and Unblock the Notifications











