వచ్చే ఏడాది రీమాసేన్ పెళ్లి
బాలీవుడ్ హీరోయిన్ రీమాన్ సేన్ త్వరలోనే ఓ ఇంటి కాబోతోంది. తనకు ప్రేమించిన చెలికాడితో వచ్చే ఏడాది పెళ్లి సిద్దం అవుతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ ఓనర్ ను రీమా పెళ్లి చేసుకోబోతోంది. అతని పేరు శివకరణ్ సింగ్. పంజాబీ కుటుంబానికి చెందిన యువకుడు. గత కొన్ని రోజులుగా రీమా-శివకరన్ ఢిల్లీ వీధుల్లో తెగ షికార్లు కొడుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఎదురు పడ్డ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇరు కుటుంబాల వారు తమ ప్రేమను అంగీకరించారని, వచ్చే సంవత్సరం పెళ్లి ఉంటుందని, డేట్ ఫిక్స్ అయిన తర్వాత మీడియాకు తెలియజేస్తామని చెప్పుకొచ్చింది.
అంతటితో ఊరుకోని ఈ బెంగాళీ భామ...తాను పంజాబీ కుర్రాన్ని పెళ్లి కోవడం ఎంతో ఆనందంగా ఉందని, తనకు పంజాబీ సంప్రదాయాలన్నా, వంటకాలన్నా ఎంతో ఇష్టం అంటూ తనకు పరిచయం ఉన్న వారందరి దగ్గరలొడలొడా వాయించేస్తోంది. ప్రస్తుతం రీమా సేన్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సీపూర్", రాహుల్ ధోలకియా తర్వాతి చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











