ఆ ఒక్కడితో భరించలేకపోతున్నా.. అందుకే అలాంటి వాటికి నో.. రెజీనా

అందాల భామ రెజీనా వరుస ఆఫర్లను దక్కించుకొంటూ మళ్లీ ట్రాక్‌లో పడినట్టు కనిపిస్తున్నది. అయితే అందరూ సోషల్ మీడియాను ఉపయోగించుకొంటూ పాపులారిటీ సంపాదించుకొంటే.. రెజీనా మాత్రం తనకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నది. సోషల్ మీడియాను దున్నేస్తున్న సెలబ్రిటీలను చూసి కూడా దానికి దూరంగా ఉండటంపై రెజీనా ఓ అభిప్రాయాన్ని తెగేసి చెప్పింది. తాను సోషల్ మీడియాకు ఎందుకు దూరం ఉంటున్నారనే విషయంపై స్పందిస్తూ..

అవసరమైనంత వరకే

అవసరమైనంత వరకే

నాకు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చాలా అకౌంట్లు ఉన్నాయి. కానీ ఎక్కువగా వాటిని ఉపయోగించను. అవసరం ఉన్నంత మేరకే నేను వాటిని వాడుకొంటాను. అలాగని నాకు వాటిపై ఎలాంటి ద్వేషం లేదు. అయితే నెటిజన్లు చేసే నెగిటివ్ కామెంట్ల వల్ల నేను చాలా హర్ట్ అవుతాను. అందుకే పోస్టులు పెట్టి తిట్టించుకోవడం ఎందుకని జాగ్రత్త పడుతాను అని రెజీనా అన్నారు.

సైబర్ ఎటాక్స్ పెరిగాయి...

సైబర్ ఎటాక్స్ పెరిగాయి...

ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల సైబర్ ఎటాక్స్ ఎక్కువయ్యాయి. వాటితో మానసిక ప్రశాంతత లోపిస్తున్నది. వాటితో అనుబంధాన్ని పెంచుకొని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే అభిప్రాయంతో ఉన్నాను. అభిమానులకు దగ్గరవ్వాలనే ఆసక్తి నాకు ఉండదా అని రెజీనా ప్రశ్నించారు.

 10 వేల మంది లైక్ కొడితే..

10 వేల మంది లైక్ కొడితే..

నా సోషల్ మీడియా అకౌంట్లలో ఏదైనా పోస్టు పెడితే 10 వేల మంది నాకు పాజిటివ్‌గా స్పందిస్తారు. కానీ ఒక్కరు చేసే నెగిటివ్ కామెంట్‌తో మొత్తం ఉత్సాహం నీరుగారిపోతుంది. ఆ రోజంతా మనసు చాలా బాధగా ఉంటుంది. అందుకే చాలా ఆచితూచి పోస్టులు పెడుతుంటాను అని రెజీనా అన్నారు.

సోషల్ మీడియా లేని కాలంలో

సోషల్ మీడియా లేని కాలంలో

గతంలో సోషల్ మీడియా లేనప్పుడు స్టార్లకు ప్రజాదరణ లేదా? అప్పుడు అభిమానులతో కలిసి నటీనటులు ఉండలేదా? సమయాన్ని బట్టి మనం కూడా మారిపోతున్నాం. కాకపోతే కొన్ని పరిమితులను విధించుకోవాలి. నా విషయం వరకు.. నా వ్యక్తిగత జీవితం, ప్రైవేట్ లైఫ్‌కు ప్రైవసీ ఉండాలని కోరుకొంటాను అని రెజీనా చెప్పారు.

Recommended Video

Evaru Movie Success Tour
ఆచార్య మూవీలో

ఆచార్య మూవీలో

ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెగాస్టార్‌తో స్టెప్పులు వేయడం ద్వారా మీడియాలో మళ్లీ పాపులారిటీని పెంచుకొన్నది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను ఇటీవల పూర్తి చేసుకొన్నది. ప్రస్తుతం నేనే నా అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X