రెజీనా షాకింగ్ లుక్.. డ్రగ్స్‌కు బానిసగా.. ఫ్లాప్‌ల నుంచి ఈసారైనా..

By Rajababu

దక్షిణాదిలో అందంతోపాటు అభినయంతో మెప్పించగల నటి రెజీనా కసాండ్రా. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఆమె రేంజ్ సరిపడా హిట్లు రాకపోవడంతో కాస్తా రేసులో వెనుకబడింది. కృష్ణవంశీ రూపొందించిన నక్షత్రం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఇప్పుడు నాని నిర్మాతగా మారి రూపొందిస్తున్న 'అ!' చిత్రం విజయంపై గంపెడు ఆశలు పెట్టుకొన్నది.

‘అ!’ చిత్రంలో రెజీనా

‘అ!’ చిత్రంలో రెజీనా

‘అ!' చిత్రంలో రెజీనా పాత్ర చాలా కీలకంగా ఉంటుందనేది తాజా సమాచారం. ఇటీవల బయటకు వచ్చిన ఆమె పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో కలకలం రేపింది. టెర్రిఫిక్ లుక్స్‌తో రెజీనా కనిపిస్తున్న తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది.

రెజీనా విభిన్నమైన లుక్

రెజీనా విభిన్నమైన లుక్

‘అ!' చిత్రంలో విభిన్నమైన క్యాస్టూమ్స్, హెయిర్ స్టయిల్‌తో రెజీనా గెటప్ పంబ రేపుతున్నది. రెజీనా లుక్స్‌లోనూ సీరియస్‌నెస్ ఆ పాత్ర ఏంటో చెప్పకనే చెబుతున్నది.

టాటూస్‌తో డిఫరెంట్‌గా

టాటూస్‌తో డిఫరెంట్‌గా

రెజీనా శరీరంపై టాటూస్‌ వేసుకొని పక్కాగా వెస్ట్రన్ లుక్‌లో ఆకట్టుకొంటున్నది. నాని చెప్పిన ప్రకారం అన్ని జోనర్లు కలిసిన కథ ఈ సినిమా స్టోరి. దర్శకుడు కత చెప్పినప్పుడు ప్రతీ నిమిషం ఉత్కంఠకు లోనయ్యాను ఆయన పేర్కొన్నారు.

అంచనాలు పెంచిన రెజీనా కసాండ్రా

అంచనాలు పెంచిన రెజీనా కసాండ్రా

‘అ!' చిత్రంలో రెజీనా గెటప్ మాత్రమే కాదు.. ఆమె పాత్ర కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో డ్రగ్ బానిసైన యువతిగా, డ్రగ్ మాఫియాలో కీలక సభ్యురాలిగా నటిస్తున్నట్టు తెలుస్తున్నది.

హీరో నాని నిర్మాతగా

హీరో నాని నిర్మాతగా

నాని నిర్మాతగా మారి రూపొందించిన ఈ చిత్రంలో రెజీనాతోపాటు కాజల్, నిత్యామీనన్, మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు.

టీజర్‌కు అనూహ్య స్పందన

టీజర్‌కు అనూహ్య స్పందన

అ! చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ టీజర్‌లో రవితేజ, నాని వాయిస్ ఓవర్ చాలా ఆసక్తిని రేపింది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందనే భావనలో నాని ఉండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X