Don't Miss!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రహస్యంగా హీరోయిన్ రెజీనా నిశ్చితార్థం.. అసలు మ్యాటర్ ఏంటి?
సినీ ఇండస్ట్రీలోని హీరోహీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు, పెళ్లి సంగతులు ఊహించని ట్విస్టులు ఇస్తుంటాయి. ఎప్పుడు ఎవరు ఎలా బాంబ్ పేలుస్తారో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి సంగతులు ఈ మధ్యకాలంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ కోవ లోనే తాజాగా రెజీనాకు సంబందించిన నిశ్చితార్థం వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సౌత్ ఇండియాలోని పలు భాషా చిత్రాల్లో తన టాలెంట్ ఏంటో నిరూపించిన రెజీనా.. తన నిశ్చితార్దాన్ని రహస్యంగా చేసుకుందట. జూన్ 13వ తేదీన చెన్నైలోని ఓ హోటల్ లో కేవలం కుటుంబీకులు, సన్నిహితుల మధ్యలో రెజీనా నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. ఈ కథనాన్ని తమిళనాడుకు చెందిన ఈ న్యూస్ సంస్థ ప్రచురించడంతో ఇది కాస్తా సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది మొదట్లో రెజీనా పెళ్లి జరగనుందని, దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
ప్రేమ పెళ్ళైనా, పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా ఎంతో ఆర్బాటంగా చేసుకుంటున్న ఈ రోజుల్లో రెజీనా ఇలా రహస్య నిశ్చితార్థం చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక రెజీనా సినిమాల సంగతులంటారా.. ఇటీవలే తెలుగులో అ! సినిమాలో డిఫెరెంట్ రోల్, అదేవిధంగా 7 సినిమాలో మరో డిఫెరెంట్ క్యారెక్టర్ లో దర్శనమిచ్చింది రెజీనా. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఈ భామ ప్రస్తుతం 'ఎవరు' అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అడవిశేష్ హీరోగా నటిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే రెజీనా పెళ్లి పీటలెక్కనుందని సమాచారం.