అతనితో ప్రేమలో పడ్డటం పెద్ద తప్పు.. అందుకే కెరీర్‌పై దెబ్బ.. రెజీనా
దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెజీనా కసాండ్రా అందంతోపాటు అభినయంతో మెప్పించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో రెజీనాకు సడన్‌గా బ్రేక్ పడింది. ప్రస్తుతం మళ్లీ సక్సెస్ అందుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. తన కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి గల కారణాలను వెల్లడిస్తూ ఇటీవల ప్రముఖ దినపత్రికతో తన భావాలను పంచుకొన్నది. రెజీనా చెప్పినదేమింటే..

అనేక మలుపులు
పదేళ్ల కెరీర్‌లో అనేక మలుపులు, ఒడిదుడుకులను చూశాను. ఆకారణంగానే ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయాను. ఇప్పుడు పలు అడ్డంకులను ఎదుర్కొని నన్ను నేను నిరూపించు కోవాలనుకొంటున్నాను. సక్సెస్‌ను చేజిక్కించుకోవడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని రెజీనా తెలిపారు.
Recommended Video


నాకు బాధ లేదు
నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆ కారణంగానే యాక్టర్ అయ్యాను. నటిగా మారినందుకు నాకు ఏ కోశాన బాధలేదు. కెరీర్ ఆరంభంలో తప్పులు చేశాను. ప్రస్తుతం వాటిని సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తున్నాను.

ప్రేమలో పడటంతో
ఓ వ్యక్తితో ప్రేమలో పడటం కెరీర్‌పై దెబ్బ పడింది. ఏదో తప్పు చేస్తున్నాను అనే సమయానికి పరిస్థితులు చేజారాయి. ఇక ప్రేమ, పెళ్లి కొన్నాళ్లు దూరంగా ఉండాలి అనుకొంటున్నాను. ఇంట్లో కూడా చెప్పేశాను. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే అని రెజీనా వెల్లడించింది.

నానీ నిర్మాతగా
‘అ!' సినిమాలో ప్రస్తుతం ఓ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నాను. ఆ కథ నచ్చడంతో హీరో నాని స్వయంగా ఆ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది.

డిఫరెంట్ గెటప్‌లో
అ చిత్రంలో ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తాను. నా గెటప్ కోసం నా స్టైలిస్టులు చాలా కష్టపడ్డారు. నాకు తెలిసి ఏ హీరోయిన్ ఈ గెటప్‌లో కనిపించినట్టు లేదు. నేనే ఫస్ట్ అనుకుంటున్నాను. నా గెటప్ చూసి అందరూ బోలెడంత ఆశ్చర్యపోయారు. చాలా మందికి నా గెటప్ బాగా నచ్చేసింది.


Click it and Unblock the Notifications











