Don't Miss!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
ఆ హీరోతో నటించడం లేదు.. ఆ వార్త రూమరే.. రెజీనా
ఇటీవల కాలంలో టాలీవుడ్లో అంతంత మాత్రంగానే కనిపిస్తున్న అందాల తార రెజీనా కసండ్రా మళ్లీ వార్తల్లో నిలిచింది.
ఇటీవల కాలంలో టాలీవుడ్లో అంతంత మాత్రంగానే కనిపిస్తున్న అందాల తార రెజీనా కసండ్రా మళ్లీ వార్తల్లో నిలిచింది. బాలకృష్ట సినిమాలో నాలుగో హీరోయిన్గా నటిస్తున్నారనే వార్తలు గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తపై రెజీనా స్పందించింది. ఆమె ఏమన్నారంటే...
|
బాలకృష్ణతో నటించడం లేదు
ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ గారి 102 చిత్రంలో నటించడం లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేరుగా చెప్పాలనుకొన్నాను. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని రెజీనా ట్విట్టర్లో స్పందించారు.
రూమర్‌పై రెజీనా ఖండన
అందాల తార రెజీనా కసాండ్రా కూడా త్వరలో బాలకృష్ణ 102 ప్రొడక్షన్లో చేరబోతున్నది. ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారితో పాటు రెజీనా నాలుగో హీరోయిన్ అని ఓ వార్త మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే.
ఆరా తీయడంతో రెజీనా
బాలకృష్ణ చిత్రంలో నటిస్తున్నారనే వార్త విషయంపై రెజీనాతో పలువురు ఆరా తీశారట. పలువురు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్ కాల్స్ కూడా వెళ్లడంతో ఈ విషయంపై అసందిగ్దతకు రెజీనా ట్విట్టర్లో తెరదించింది.
రెజీనాతో సంప్రదింపులు
ఇదిలా ఉండగా, బాలకృష్ణ చిత్రం కోసం రెజీనాను చిత్ర నిర్వాహకులు సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై రెజీనా సన్నిహితులు కూడా స్పందించారు. ఓ సినిమాలోని పాత్రను రిజెక్ట్ చేసిన విషయాన్ని మీడియాకు చెప్పడం భావ్యం కాదు అని పేర్కొన్నట్టు మరో వార్త వెలుగు చూసింది. అయితే బాలకృష్ణ సినిమాను రిజెక్ట్ చేయడమనేది ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.