twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోతో నటించడం లేదు.. ఆ వార్త రూమరే.. రెజీనా

    ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో అంతంత మాత్రంగానే కనిపిస్తున్న అందాల తార రెజీనా కసండ్రా మళ్లీ వార్తల్లో నిలిచింది.

    By Rajababu
    |

    ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో అంతంత మాత్రంగానే కనిపిస్తున్న అందాల తార రెజీనా కసండ్రా మళ్లీ వార్తల్లో నిలిచింది. బాలకృష్ట సినిమాలో నాలుగో హీరోయిన్‌గా నటిస్తున్నారనే వార్తలు గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తపై రెజీనా స్పందించింది. ఆమె ఏమన్నారంటే...

    బాలకృష్ణతో నటించడం లేదు

    ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ గారి 102 చిత్రంలో నటించడం లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేరుగా చెప్పాలనుకొన్నాను. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని రెజీనా ట్విట్టర్‌లో స్పందించారు.

     రూమర్‌పై రెజీనా ఖండన

    రూమర్‌పై రెజీనా ఖండన

    అందాల తార రెజీనా కసాండ్రా కూడా త్వరలో బాలకృష్ణ 102 ప్రొడక్షన్‌లో చేరబోతున్నది. ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారితో పాటు రెజీనా నాలుగో హీరోయిన్ అని ఓ వార్త మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే.

    ఆరా తీయడంతో రెజీనా

    ఆరా తీయడంతో రెజీనా

    బాలకృష్ణ చిత్రంలో నటిస్తున్నారనే వార్త విషయంపై రెజీనాతో పలువురు ఆరా తీశారట. పలువురు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్ కాల్స్ కూడా వెళ్లడంతో ఈ విషయంపై అసందిగ్దతకు రెజీనా ట్విట్టర్‌లో తెరదించింది.

    రెజీనాతో సంప్రదింపులు

    రెజీనాతో సంప్రదింపులు

    ఇదిలా ఉండగా, బాలకృష్ణ చిత్రం కోసం రెజీనాను చిత్ర నిర్వాహకులు సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై రెజీనా సన్నిహితులు కూడా స్పందించారు. ఓ సినిమాలోని పాత్రను రిజెక్ట్ చేసిన విషయాన్ని మీడియాకు చెప్పడం భావ్యం కాదు అని పేర్కొన్నట్టు మరో వార్త వెలుగు చూసింది. అయితే బాలకృష్ణ సినిమాను రిజెక్ట్ చేయడమనేది ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.

    English summary
    Several rumours in the media that Regina Cassandra is also a part of the Balakrishna 102 project. But the Regina finally responded on all these rumours. The actress took to Twitter to clarify the same and posted. She tweeted that ‘To set the record straight.. I am not a part of #KSRavikumar- #Balakrishna Garus #NBK102 . I wish the team all the very best!’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X