వీడియో: హాఫ్ శారీలో రెజీనా 'కికి ఛాలెంజ్'.. డాన్స్ చూస్తే, అల్లు శిరీష్ ఏమన్నాడో తెలుసా!
పాప్ సింగర్ డార్క్ రూపొందించిన 'ఇన్ మై ఫీలింగ్స్' సాంగ్ గత నెలరోజులుగా సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది. ప్రస్తుతం ఈ సాంగ్ 'కికి ఛాలెంజ్', 'ఇన్ మై ఫీలింగ్స్ ఛాలెంజ్' పేరుతో సోషల్ మీడియాలో సునామి సృష్టిస్తోంది. ఇంతలా ట్రెండ్ అయ్యే అంశంపై సెలెబ్రిటీలు తప్పకుండా కన్నేస్తారు.
ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన హాట్ హీరోయిన్ రెజీనా తన అందమైన డాన్స్ తో అదరగొట్టేసింది. అది కూడా హాఫ్ శారీ ధరించి ఈ సాంగ్ కు పెర్ఫామ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెమ్మదిగా కదులుతున్న వాహనం పక్కనే డాన్స్ చేయడమే ఈ ఛాలెంజ్.

రెజీనా డాన్స్ కు అల్లు శిరీష్ ఫిదా అయిపోయాడు. రెజినా పెర్ఫామెన్స్ ఎపిక్ అంటూ ట్వీట్ చేశాడు. ఇది కేవలం రెజినాకు మాత్రమే సాధ్యం అంటూ అల్లువారబ్బాయి ప్రశంసించడం విశేషం. అల్లు శిరీష్, రెజీనా కలసి కొత్తజంట చిత్రంలో నటించారు.
regina cassandra allu sirish kiki challenge in my feelings challenge tollywood రెజీనా అల్లు శిరీష్ కికి ఛాలెంజ్


Click it and Unblock the Notifications