మళ్లీ ఓపెన్ అయిన రెజీనా.. నా స్నేహితుల్లో చాలామంది లెస్బియన్లు అంటూ
Recommended Video
ఏదైనా ఓపెన్ గా మాట్లాడేయటం రెజీనా నైజం. ఎలాంటి విషయాన్నైనా కుండబద్దలు బద్దలు కొట్టేస్తూ చెప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్యకాలంలో రెజీనాపై రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. రెజీనా నిశ్చితార్థం జరిగిందని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన రెజీనా.. తన నిశ్చితార్థం, సినిమాలు ఇతరత్రా విషయాలపై స్పందించింది. ఈ మేరకు తన స్నేహితుల్లో చాలామంది లెస్బియన్లు ఉన్నారని చెప్పి ఆశ్చర్యపర్చింది.

అలాంటివి బాహాటంగానే చెబుతా
తనకు సంబందించిన ఏ విషయమైనా తాను బాహాటంగానే చెప్పేస్తానని అంటోంది రెజీనా. ఏదీ దాచాల్సిన అవసరం తనకు లేదని మాట్లాడుకొచ్చింది. ఈ మేరకు తన నిశ్చితార్థం, పెళ్లి విషయాల్లో మీడియా తననే కన్ఫ్యూజన్ లో పడేసిందని ఆమె చెప్పింది. తన నిశ్చితార్థం జరిగితే తానే స్వయంగా చెబుతానని పేర్కొంది.

నేను చెప్పే వరకు నమ్మకండి
మరోవైపు తాను జయలలిత బయోపిక్ లో నటిస్తోందని సోషల్ మీడియాలో షికారు చేస్తున్న వార్తలపై కూడా రెజీనా స్పందించింది. జయలలిత బయోపిక్ లో నటించాలని తనను ఎవరూ సంప్రదించలేదని, ఆ సీఈన్మలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. తనకు సంబందించిన వరకు ఏ వార్త ఉన్నా తానే చెబుతానని, అప్పుడు మాత్రమే వాటిని నమ్మండి అని రెజీనా పేర్కొంది.

లెస్బియన్‌గా బాలీవుడ్ ఎంట్రీ
అందం, అభినయంతో సౌత్ ఇండియా ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న రెజీనా.. ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించిన ఆమెకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ చూపును కూడా తనవైపుకు తిప్పుకుంది రెజీనా. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ పాత్రపై కూడా స్పందిస్తూ ఆసక్తికర విష్యం చెప్పింది రెజీనా.

నా స్నేహితుల్లో చాలామంది లెస్బియన్లు
తన స్నేహితుల్లో చాలామంది లెస్బియన్లు ఉన్నారని ఓపెన్ గా చెప్పేసింది రెజీనా. వారంతా ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' సినిమా చూసి ఉద్వేగానికి గురయ్యారని తెలిపింది. ఆ పాత్ర పోషించినందుకు తనను మెచ్చుకున్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. సామాజిక అంశాలతో కూడిన సినిమాలు చేయడం తనకు చాలా ఇంట్రెస్ట్ అని, ఇలాంటి విషయాల్లో సమాజాన్ని ప్రభావితం చేయడంలో సినిమా ప్రాధాన్యత ఎంతో ఉంటుందనే కోణంలో మాట్లాడుకొచ్చింది రెజీనా.

ఓపెన్ మెంటాలిటీ.. రెజీనా మూవీస్
గతంలో కూడా పోర్న్ సినిమాల పట్ల ఓపెన్ గా మాట్లాడటం, ఇప్పడు తన స్నేహితుల్లో చాలామంది లెస్బియన్లు ఉన్నారని పేర్కొనడం చూసి రెజీనాది చాలా ఓపెన్ మెంటాలిటీ అంటున్నారు జనం. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న రెజీనా ప్రస్తుతం 'ఎవరు' అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అడవిశేష్ హీరోగా నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











