పెళ్లి వార్తలపై స్పందించిన రెజీనా..

సోషల్ మీడియా ప్రభావం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. నిజాన్ని ఎంత స్పీడ్‌గా ప్రజల్లోకి తీసుకెళుతుందో.. అబద్దాన్ని అంతకంటే స్పీడ్‌గా అందరికీ దగ్గర చేస్తుంది. ముఖ్యంగా సెలెబ్రిటీలు, వారి ప్రేమ,పెళ్లి సంగతులపై రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోనే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త రెజీనా నిశ్చితార్థం.

చెన్నైలో ఎవ్వరికీ తెలియకుండా రెజీనా రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఓ తమిళ మీడియా సంస్థ రాసిన కథనం ఆధారంగా జూన్ 13 వ తేదీన కేవలం తన కుటుంబీకులు, దగ్గరి స్నేహితుల మధ్య రెజీనా నిశ్చితార్థం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే ఏడాది రెజీనా వివాహం జరగనుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు ఆల్రెడీ మొదలు పెట్టారని తెగ వార్తలు షికారు చేశాయి. ఇవి చూసిన రెజీనా స్వయంగా తన పెళ్లి వార్తలపై స్పందించింది.

 Regina Cassandra Reaction On Her Engagement News

గత వారం రోజులుగా తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ రూమర్సే అని కొట్టిపారేసింది రెజీనా. అసలు ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారు.. ఎందుకు పుట్టిస్తారనేది అస్సలు అర్థం కాదని అసహనం వ్యక్తం చేసింది. నిజంగానే తన పెళ్లి జరగాల్సి ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానని, ఇలాంటి వార్తలు నమ్మొద్దని రెజీనా పేర్కొంది. దీంతో రెజీనా పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లే ఇక.

రెజీనా సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే తెలుగులో 'అ!' అనే డిఫెరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రెజీనా. ఆ తర్వాత '7' అనే సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలో మరో డిఫెరెంట్ క్యారెక్టర్‌లో దర్శనమిచ్చింది రెజీనా. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఈ భామ ప్రస్తుతం 'ఎవరు' అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో అడవిశేష్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X