twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుసగా ముద్దు సీన్లు, గర్వంగా ఉంది: రెజీనా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగులో తాను చేస్తున్న ప్రతి సినిమాలోనూ హీరోతో లిప్ లాక్ సీన్లు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ రెజీనా....టాలీవుడ్ సీరియల్ కిస్సర్‍‌గా పేరు తెచ్చుకుంది. వచ్చే వారం ఆమె నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ముద్దు సీన్ల గురించి ఆసక్తికరంగా స్పందించింది.

    తెలుగులో వరుస లిప్ లాక్ సీన్లతో ఫేమస్ అయిపోయారు...దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ.....‘పిల్లా నువ్వులేని జీవితం'లో మాత్రం ముద్దు సీన్ లేదు. స్క్రిప్టు డిమాండ్ చేసినపుడు ముద్దు సీన్లు చేయక తప్పదు. టాలీవుడ్లో ముద్దు సీన్ల విషయంలో ట్రెండ్ సెట్టర్ అయినందుకు గర్వంగా ఫీలవుతున్నాను' అని రెజీనా చెప్పుకొచ్చింది.

    Regina feel proud about onscreen kissing

    ‘పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా విషయానికొస్తే...సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా నటించారు. జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని వాసు, హర్షిత్‌ నిర్మాతలు. అల్లు అరవింద్‌ సమర్పకులు. సినిమా చిత్రీకరణ పూర్తై రీసెంట్ గానే ఆడియో విడుదలైంది. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయటానికి నిర్ణయించారు.

    చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి, నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

    English summary
    "I feel that if the script demands one should not mind doing it. In fact, I feel proud that I have started the trend of onscreen kissing in Tollywood." Regina said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X