రెజీనా కేక పెట్టించింది (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : తెలుగు,తమిళ భాషల్లో బిజీగా ఎదుగుతున్న హీరోయిన్ రెజీనా. తాజాగా ఆమె తమిళంలో 'రాజతంత్రం' అనే చిత్రంలో నటింస్తోంది. ఈ చిత్రంలో ఆమె మిచ్చెల్లో డి మెల్లో పాత్రలో కనిపించనుంది. ఈ హీస్ట్ చిత్రం ప్రమోషన్ ని చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. ఈ చిత్రం టీజర్..ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు... టీజర్ ని ఇక్కడ చూడండి...

ట్విట్టర్ ద్వారా చిత్రం ఫస్ట్ లుక్,టీజర్ లు,పోస్టర్స్ లను యూనిట్ సెలబ్రెటీల ద్వారా విడుదల చేసి క్రేజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్టుపై మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం కనిపిస్తోంది. ఇందులో భాగంగా విడుదల చేసిన రెజీనా ఫొటో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

రీసెంట్ గా సాయి ధరమ్ తేజ సరసన...పిల్లా నువ్వు లేని జీవితం చిత్రం చేసిన రెజీనా ...అదే హీరోతో సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం చేస్తోంది. మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వరస ఆఫర్స్ వస్తున్నాయి. వాటిని ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది.

మరో ప్రక్క చెన్నై నుంచి టాలీవుడ్‌కి దిగుమతి అయిన హీరోయిన్ రెజీనా ఇక్కడ ప్రతి హీరోతో లిప్ లాక్ సీన్లలో నటిస్తూ దుమ్ముదులిపేస్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీ అయిపోయింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ప్రతి చిత్రంలో లిప్ లాక్ సీన్స్‌కు గ్రీన్ సిగ్నెల్స్ ఇచ్చేస్తోంది. ప్రతి హీరోకి లిప్ లాక్స్ వేసి యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Regina look in 'Rajathandhiram' movie

దాంతో హిట్, ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా అవకాశాలు దక్కించుకుంటుంది. రొటీన్ లవ్ స్టోరీ, రా..రా..కృష్ణయ్య, పవర్ చిత్రాలలో ఈ అమ్మడు సందీప్‌ కిషన్, రవితేజల లిప్ కిస్‌లు అందుకుంది. ఇక తన అప్ కమింగ్ మూవీస్ లో కూడా అదే తరహాలో రొమాన్స్ ని ఘాటుగా పండించడానికి సిద్ధంగా ఉంది. చిన్న సినిమాల్లో నటిస్తూ ఈ బ్యూటీ అభిమానుల గుండెల్లో పెద్ద స్థానాన్ని సంపాదించుకుంది.

లో బడ్జెట్, హై బడ్జెట్ అని తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఫుల్ క్రేజ్ కొట్టేసింది. ఇప్పటి వరకు ఈ ముద్దుల గుమ్మ నటించిన ఏ మూవీకి సక్సెస్ టాక్ రాలేదు. అయినా రెజీనా అందం మాత్రం కుర్రకారుకి తెగ నచ్చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్స్‌ జాబితాలో రెజీనా చేరిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X