»   » సెలిబ్రిటీనయ్యా: సాయి ధరమ్ తేజ్‌తో లింకనే గాసిప్స్‌పై రెజీనా

సెలిబ్రిటీనయ్యా: సాయి ధరమ్ తేజ్‌తో లింకనే గాసిప్స్‌పై రెజీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తాను ఓ సాధారణ హీరోయిన్‌ను మాత్రమే అని ఇప్పటి వరకు అనుకున్నానని, తనపై గాసిప్స్ వస్తుండటంతో సెలబ్రిటీ అయిపోయాననే ఫీలింగ్ కలుగుతోందని చెప్పింది రెజీనా. ఆమెకూ హీరో సాయి ధరమ్‌ తేజ్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఇటీవల కొన్ని వెబ్‌సైట్స్‌లో వార్తలు వెలువడ్డాయి. వీరిద్దరు కలిసి పిల్లా నువ్వులేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో నటించారు.

వరుసగా రెండు సినిమాలు చేయడంతో తమ మధ్య ఏదో సంబంధం వుందని పుకార్లు సృష్టిస్తున్నారని, సాయి ధరమ్‌ తేజ్ తనకు మంచి మిత్రుడు మాత్రమే అని వివరణ ఇచ్చింది ఆ భామామణి. సినీ పరిశ్రమలో గాసిప్స్‌రావడం మామూలు విషయమేనని అబిప్రాయపడింది.

Regina reacts on gossips about her relation with Sai Dharam Tej

మూడేళ్లుగా ఇండస్ట్రీలో వుంటున్నావు..ఇప్పటివరకు నీ గురించి గాసిప్స్ ఎందుకు రావడం లేదు అని తన ఫ్రెండ్స్ అడుగుతుంటారని. కొంచెం ఆలస్యంగానైనా తనపై గాసిప్స్ ప్రచారం కావడం ఆనందంగా వుందని అన్నది.

వాటివల్ల తాను పెద్ద సెలబ్రిటీ అయిపోయాననే భావన కలుగుతోంది అని చెప్పింది. ఒకవేళ తాను ప్రేమలో పడితే ఎలాంటి దాపరికం లేకుండా అందరికి తెలియజేస్తానని, చిత్రసీమలో రహస్యాల్ని ఎక్కువకాలం దాచలేమని అన్నది. ప్రస్తుతం ఈ సొగసరి గోపీచంద్ సరసన సౌఖ్యం చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Heroine Regina reacted on the gossips about the relation with hero Sai Dharam Tej.
Please Wait while comments are loading...