గీతా ఆర్ట్స్ లో ఛాన్స్ కొట్టేసిన రెజీనా

By Srikanya

హైదరాబాద్: 'ఎస్‌.ఎమ్‌.ఎస్‌', చిత్రంతో పరిచయమైన రెజీనా మరో కొత్త చిత్రంలో ఎంపికైంది. చిరంజీవి మేనల్లుడు సాయిధర్మతేజ్‌ కథానాయకుడిగా గీతా ఆర్ట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా రెజీనాను ఎంపిక చేశారు. రీసెంట్ గా 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రాల్లో నటించిందీ భామ. అలాగే హరీష్ శంకర్ ,ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసారని సమాచారం.

ఈ చిత్రం గురించి నిర్మాతలు బన్నీ వాసు, హర్షిత్‌ మాట్లాడుతూ... ''వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమిది. రెజీనా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. వినోదానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కిస్తున్నాం. సగం చిత్రీకరణ పూర్తయింది. మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము'' అన్నారు.

ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రంలో హీరోయిన్ గా అనేకమందిని పరిశీలించాక చివరికి అదృష్టం రెజీనాను వరించింది. కథలో ముఖ్యపాత్రగా నిలిచే హీరోయిన్ గా, అన్ని రసాల కలబోతగా రూపొందిస్తున్న ఈ పాత్రకు న్యాయం ఎవరు చేయగలరా అని తరచి తరచి చూసి చివరికి నిర్మాత అల్లు అరవింద్ రెజీనాను ఎంపిక చేశారని తెలుస్తోంది.

పలుభారీ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్‌లో అవకాశం అంటే చిన్న విషయం కాదు. పైగా ఈ చిత్రంలో రెజీనాది కేవలం పాటలకు మాత్రమే పరిమితమయ్యే పాత్ర కాదు. కథలో ఆమె పాత్ర కీలకంగా ఉంటుంది. రొమాంటిక్, ఎమోషన్ ఇలా పలు రసాలు కనబర్చే వీలున్న పాత్ర కావడంతో రెజీనా ఆనందపడుతున్నారు.

ఇక ఈ గీతా ఆర్ట్స్ చిత్రానికి ఎ.యస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. బన్నీ వాసు, హర్షిత్‌ నిర్మాతలు. అల్లు అరవింద్‌ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శ్రీహరి కీలక పాత్రధారి. బన్నీ వాసు, హర్షిత్‌ నిర్మాతలు. ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X