హీరోయిన్ చేతిలో దెబ్బలు తిన్న మెగా ఫ్యామిలీ హీరో!
హైదరాబాద్: చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా ఎ.ఎస్.రవికుమార్ దర్శకుడిగా గీతా ఆర్ట్స్, ఎస్.వి.యస్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'పిల్లా నువ్వు లేని జీవితం''. రెజీనా హీరోయిన్. అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు, హర్షిత్ లు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తిర విషయం వెల్లడించారు. ఈ సినిమాలో హీరోయిన్ రెజీనా చేతిలో 14 సార్లు చెంప దెబ్బతింటాడట సాయి ధరమ్ తేజ్. హీరో హీరోయిన్ల మధ్య జరిగే గొడవ సన్నివేశాల్లో ఈ చెంపదెబ్బలు ఉంటాయట. ఈ చిత్రంతో పాటు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'రేయ్' చిత్రంలోనూ హీరోయిన్ సయామీ ఖేర్ చేతిలో 11 సార్లు తన్నులు తిన్నాడట.

ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సత్యకృష్ణన్, చంద్రమోహన్, ధర్మవరపు, రఘుబాబు, దువ్వాసి మోహన్, రజిత, సత్యకృష్ణ, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలుః మరుధూరి రాజా, పాటలుః చంద్రబోస్, అశోక్ తేజ, సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫిః దాశరధిశివేంద్ర, కథ, మాటలు, దర్శకత్వం, ఎ.ఎస్.రవికుమార్.
ఈ చిత్రం ద్వారా ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్న కొడుకు హర్షిత్ నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా విచిత్రంగా ప్రారంభమైంది. నా అన్న కొడుకు హర్షిత్ ను ఈ సినిమా ద్వరా నిర్మాతగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. బన్నీ వాసు తో కలిసి సినిమా నిర్మాణానికి సంబందించిన విషయాలను తెలుసుకుంటాడని విశ్వసిస్తున్నాను. దర్శకుడు రవికుమార్ ఈ సినిమాకు ఎంచుకున్న కథనం బాగుంది. గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన సమయంలో దేవిశ్రీప్రసాద్ నాకు ఈ టైటిల్ చెప్పి రిజిస్టర్ చేసి పెట్టమన్నాడు. అప్పుడు చేసిన ఈ టైటిల్ ఇలా ఉపయోగపడటం ఆనందంగా ఉంది.


Click it and Unblock the Notifications











