twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోర్న్ సినిమాలపై ఓపెన్ అయిన రెజీనా.. తప్పేముంది? అందరూ చేసేదేగా..

    |

    ఒకప్పటిలా లేదు లోకం తీరు. టెక్నాలజీ విస్తరిస్తున్నా కొద్దీ జనాల్లో సరికొత్త మార్పులు వస్తున్నాయి. మార్కెట్‌లో ఇమ్మడిముమ్మడిగా దొరుకుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరికి తోచిన విధంగా వారు అంది పుచ్చుకుంటున్నారు. అయితే వెనకటిలా కాకుండా నేటితరంలో శృంగార సంబందించిన విషయాలు మాట్లాడటంలో చాలా ఓపెన్ అయ్యారు జనం. నిత్య జీవితంలో భాగమైన శృంగార జీవితం పట్ల సెలెబ్రిటీలు సైతం బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా యంగ్ హీరోయిన్ రెజీనా శృంగార సినిమాల విషయంలో ఓపెన్ అయింది. వివరాల్లోకి పోతే..

    ఇండియాలో హిపోక్రసీ

    ఇండియాలో హిపోక్రసీ

    హిపోక్రసీ అంటే కపట నాటకము.. డీప్ గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా కొన్ని విషయాలు దాచేస్తూ మాట్లాడటం. సాధరణంగా ప్రతీ వ్యక్తిలో ఎదో ఒక సందర్భంలో హిపోక్రసీ అనేది ఉంటుంది. ఇండియాలో అయితే మెజారిటీ పబ్లిక్ లో ఇది కనిపిస్తుంటుంది. ఈ విషయం చెబితే ఎదుటి వ్యక్తికి తనపై చేదు అభిప్రాయం నెలకొంటుందో ఏమో!, ఇది చెబితే లేనిపోని సమస్యలు తలెత్తుతాయేమో అని రకరకాల సందర్భాల్లో హిపోక్రసీ ప్రదర్శిస్తుంటారు పబ్లిక్.

    పోర్న్ విషయాల్లో శృతిమించి

    పోర్న్ విషయాల్లో శృతిమించి

    ఇక శృంగార సంబంధిత విషయాల పట్ల అయితే హిపోక్రసీ శృతిమించి ఉంటుంది. సెక్స్ తో కూడుకున్న విషయాలు మాట్లాడాలంటే కాస్త ఆలోచిస్తుంటారు జనం. అయితే మోడ్రెన్ డేస్ లో దీనిపట్ల కొంతవరకు మార్పు వచ్చినప్పటికీ.. అడపాదడపా ఇది కనిపిస్తూనే ఉంది. పోర్న్ సినిమాలు, పోర్న్ సంగతుల్లో దాచేస్తూ మాట్లాడటం అనేది అక్కడక్కడా కనిపిస్తోంది.

    పోర్న్ పట్ల ఓపెన్ అయి ఆశ్చర్యపర్చిన రెజీనా

    పోర్న్ పట్ల ఓపెన్ అయి ఆశ్చర్యపర్చిన రెజీనా

    సాధారణ జనాలే కాదు సెలెబ్రిటీలు సైతం పోర్న్ సంబంధిత విషయాలు చెప్పడంలో కాస్త వెనుకాముందు ఆలోచిస్తారు. కానీ మోడ్రెన్ జెనెరేషన్ అని నిరూపిస్తూ పోర్న్ పట్ల ఓపెన్ అయి ఆశ్చర్యపర్చింది యంగ్ హీరోయిన్ రెజీనా. తాను అడల్ట్ సినిమాలు చూసేదాన్నని ఏ మాత్రం జంకకుండా కుండబద్దలు కొట్టేసింది.

    స్కూల్ డేస్‌లో పోర్న్ సినిమాలు చూసేవారా అని అడగగానే

    స్కూల్ డేస్‌లో పోర్న్ సినిమాలు చూసేవారా అని అడగగానే

    ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్కూల్ డేస్ లో మీరు అడల్ట్ ఫిలిమ్స్ చూశారా..? అని రెజీనాను అడిగగానే ''ఓ ఎస్'' అని బదులిచ్చి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. ఈ రోజుల్లో అదంతా కామనే కదా! అని కూడా చెప్పి ఊహించని షాకిచ్చింది రెజీనా. దీంతో పోర్న్ విషయమై ఆమె లోని ఓపెన్ నేచర్ పట్ల పాజిటివ్‌గా స్పందించారు అక్కడి జనం.

    హీరోయిన్ రెజీనా

    హీరోయిన్ రెజీనా

    సౌత్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెజీనా.. ఇటీవలే తెలుగు అ! సినిమాలో డిఫెరెంట్ రోల్, అదేవిధంగా 7 సినిమాలో మరో డిఫెరెంట్ క్యారెక్టర్ లో దర్శనమిచ్చింది. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఈ భామ ప్రస్తుతం 'ఎవరు' అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అడవిశేష్ హీరోగా నటిస్తున్నాడు.

    English summary
    When Regina was asked whether she had watched adult movies during her teenage days, the gorgeous bombshell replied in the affirmative by stating that it’s quite common for youngsters nowadays.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X