twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ చిత్రంలో 'రొటీన్ లవ్ స్టోరీ' హీరోయిన్

    By Srikanya
    |

    హైదరాబాద్ :'ఎస్.ఎమ్.ఎస్','రొటీన్ లవ్ స్టోరీ'చిత్రాలతో యూత్ ని ఆకట్టుకున్న అందం రెజీనా. ఆమె తాజాగా హరీష్ శంకర్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఎంపికైందని సమాచారం. అయితే హీరోయిన్ గా కాకుండా ఓ కీలకమైన పాత్రకు ఆమెను తీసుకున్నట్లు చెప్తున్నారు. హీరోయిన్ పాత్ర కాకపోయినా,పెద్ద హీరో చిత్రం చేస్తే గుర్తింపు బాగా వస్తుందని ఆమె చిత్రం ఓకే చేసినట్లు తెలుస్తోంది.

    ఇక రెజీనా ప్రస్తుతం నారా రోహిత్ చిత్రం కూడా ఓకే చేసింది. తాతినేని సత్య దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రం ఓ యాక్షన్ థ్రిల్లర్. జనవరి రెండవవారంలో సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రాలు కాక రెజీనా ఒప్పుకోవాల్సిన చిత్రాలు మరిన్ని ఉన్నాయి. 'రొటీన్ లవ్ స్టోరీ' టాక్ బాగోకపోయినా ఆమెకు మాత్రం వరస ఆపర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

    జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ చిత్రం విషయానికి వస్తే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. హీరోయిన్ గా సమంత చేస్తోంది. వీరిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయని,ముఖ్యంగా డైలాగులు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. అలాగే పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో ఈ లవ్ స్టోరీ స్క్రిప్టుని హరీష్ శంకర్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

    మరో ప్రక్క గతంలో ఎన్టీఆర్ తో బృందావనం వంటి హిట్ చిత్రం తీసిన దిల్ రాజు ఈచిత్రానికి నిర్మాత కావడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

    English summary
    
 Regina,who has earned much acclaim for her performance in SMSand Routine Love Story, is one of the top contenders for a major role in the NTR-starrer to be directed by Harish Shankar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X