twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహిళలను బ్యాడ్‌గా... నిర్మాత ఏక్తాకపూర్‌కు సమన్లు

    By Bojja Kumar
    |

    న్యూఢిల్లీ: బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌కు జాతీయ మహిళా కమీషన్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఆమె నిర్మించిన 'ఏక్ థి దాయన్' చిత్రంపై అభ్యంతరాలు వెల్లడిస్తూ జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదులు అందడంతో వివరణ ఇవ్వాల్సిందిగా ఏక్తాకు నోటీసులు జారీ చేసారు. మహిళలను ఈచిత్రంలో బ్యాడ్‌గా చూపించారనే ఆరోపణలు ఈచిత్రంపై వెల్లువెత్తుతున్నాయి.

    కమీషన్ చైర్ పర్సన్ మమతా శర్మ మాట్లాడుతూ 'ఏక్తాకపూర్ నిర్మించిన ఏక్ థి దాయన్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పితా రాయ్ చక్రవర్తి కంప్లంట్ చేసారు. ఈ మేరకు మేము ఏక్తాకు నోటీసులు జారీ చేసాము. ఏప్రిల్ 9వ తేదీన కమీషన్ ముందు హాజరవ్వాల్సిందిగా కోరాము' అని తెలిపారు.

    'ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్లో క్షుద్ర విద్యలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అవి సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయని మాత్రం అనుకోవడం లేదు. ఈ తరం వారికి క్ష్రుద్రవిద్యలు తెలియవు. అలాంటి వాటి గురించి వారికి నేర్పాల్సిన అవసరం కూడా లేదు, ఇలాంటివి సమాజానికి అంత మంచి పరిణామాలు కాదు' అని మమతా శర్మ వ్యాఖ్యానించారు.

    సినిమాలో మహిళలను క్షుద్రపూజలు చేసే వారిగా చూపడంతో కోల్‌కతాకు చెందిన సామాజిక కార్యకర్త ఇప్సితారాయ్ చక్రవర్తి 'ఏక్ థి దాయన్' చిత్ర నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ సంస్థపై జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసారు. ఈ కంప్లైంట్‌పై ఏక్తా కపూర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని మఖేష్ శర్మ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో నటిస్తున్న కొంకణ సేన్ తండ్రే ఈ ముఖేష్ శర్మ.

    English summary
    Film producer Ekta Kapoor has annoyed National Commission for Women (NCW) for portraying women in regressive roles in her forthcoming film "Ek Thi Daayan". The NCW has summoned the head of "Balaji Telefilms" to explain her stand regarding a complaint filed against the producers of the film for showing women in "bad light".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X