ఖూబ్‌సూరత్: సోనమ్ కపూర్‌ను దీవించిన రేఖ
ముంబై: హిందీలో 1980 దశకంలో వచ్చి బాక్సాఫీస్ వద్ద హిట్టయిన ఖూబ్‌సూరత్‌ను రీమేక్ చేస్తున్నారు. పాత ఖూబ్‌సూరత్ చిత్రంలో రేఖ పోషించిన పాత్రను కొత్త సినిమాలో సోనమ్ కపూర్ పోషిస్తోంది. ఈ సందర్భంగా సోనమ్ కపూర్ రేఖ నుంచి ఆశీస్సులు తీసుకుంది.
తాను చేస్తున్న సినిమాకు రేఖ నుంచి ఆశీస్సులు తీసుకున్నానని, జబ్ తక్ హై జాన్ ప్రీమియర్‌లో తాను రేఖను కలిశానని, ఆ సమయంలో రేఖ తనను దీవించిందని సోనమ్ కపూర్ చెప్పింది.
పాత ఖూబ్‌సూరత్ చిత్రంలోని పాత్ర స్ఫూర్తిని తీసుకుని ఆధునిక పద్ధతులకు అనుగుణంగా పాత్రను తీర్చి దిద్దుతున్నామని, తాము ఈ కాలానికి తగినట్లు పాత్రను మార్చుకుంటున్నామని, అమ్మాయి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను రూపొందిస్తున్నామని, అదే స్టోరీలైన్‌కు కూడా కట్టుబడి లేమని సోనమ్ వివరించింది.
పాత ఖూబ్‌సూరత్ సినిమాకు హృశికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అశోక్ కుమార్, దీనా పాఠక్, రాకేష్ రేషన్ నటించారు. కొత్త ఖూబ్‌సూరత్ సినిమాను నటుడు, సోనమ్ తండ్రి అనిల్ కపూర్ రీమేక్ చేస్తున్నారు. శాశంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.
శశాంక్‌తో పనిచేయడానికి తాను ఉత్సుకత ప్రదర్సిస్తున్నట్లు సోనమ్ చెప్పింది. అతను దర్శకుడిగా మేధావి అని అన్నారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











