ప్రముఖ నటి రేఖ తనతోపాటు ఒక హిందీ సినిమాలో నటించి, ఆ తర్వాత తెలుగు సినిమాలో నటించాలని మెగాస్టర్ చిరంజీవిని విజ్ఞప్తి చేశారు.చిరంజీవికి ఈ విజ్ఞప్తి చేసినప్పుడు చిరంజీవి సిగ్గుపడుతూనే ఆనందం చిందించారు.ఆయన సిగ్గుపడటం చూసి స్టేజిపై ఉన్నవారు మొదట ఆశ్చర్యపోయారు. ఆ సంతోష సమయంలో ఆయన వెంటనే తన భార్య సురేఖ ను కూడా వేదికమీదకు రావలసిందిగా కోరారు.ఇదంతా రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమంలో జరిగింది.చిరంజీవి, జయసుధలకు ఫిలింపేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులు, ఇతర నటీనటులకు ఉత్తమ అవార్డుల ప్రదానం జరిగింది. చిరంజీవికి రేఖ ఈ అవార్డును ప్రదానం చేసిన తర్వాత ఆమె ఈ కోర్కె కోరారు. రేఖ తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి నటించాలని కోరినప్పుడు ప్రేక్షకులు పెద్దెత్తున చప్పట్లు కొట్టారు.