ఇద్దరు రేఖల మధ్య నా రేఖ మారుతుందన్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ లో సతీసమేతంగా హాజరయ్యి, భార్య సురేఖను కూడా స్టేజ్ మీదకు ఆహ్వానించడంతో ఆడిటోరియం మొత్త చప్పట్లతో మారుమోగింది. 'చిరు" తన భార్య సురేఖను అనేక ఫంక్షన్లకు తీసుకొని వెళ్ళిన, సురేఖను మాత్రం ఎప్పుడు వేదిక మీదకు పిలవలేదు. అందుకు భిన్నంగా ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్ లో చిరు సురేఖను వేదిక మీదికి పిలిచి ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
అప్పటికే వేదిక మీద ఉన్న నటి 'రేఖ" సురేఖను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించడంతో ఆడిటోరియం మరొక్కసారి చప్పట్లతో మారుమోగింది. హిందీనటి రేఖ, చిరు భార్య సురేఖ మధ్య మెగాస్టార్ నిలుచొని ప్రేక్షకులకు కనువిందు చేశాడు. ఇప్పుడు నేను ఇద్దరి రేఖల మధ్య ఉన్నాను. ఇప్పటికైనా నా రేఖ మారుతుందని ప్రగాఢ విశ్వాసంతో ఉన్నానని నా రేఖ మారుతుందని త్వరలోనే మీ కోరిక తీరబోతుందని అన్నారు..
పాపం చిరు ముఖ్యమంత్రి కావాలనే 'చిరు" ఆశను ఇన్ డైరెక్ట్ గా ఇలా చెప్పి, ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు. ప్రక్కన ఉన్న రేఖ చిరు మాటలతో ముసిముసి నవ్వులు చిందించింది. పెళ్ళి చేసుకోని రేఖ 'చిరు" మాటలకు వేరే అర్థాలు తీసుకుందా?అని ఫిలింనగర్ న్యూస్..


Click it and Unblock the Notifications











