twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వికీలీక్స్‌ కీ ఎన్టీఆర్ సంబందం ఏంటి‌?

    By Srikanya
    |

    ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న వింటున్న పదం వికిలీక్స్. అయితే ఇప్పుడు వికిలీక్సీ కు ఎన్టీఅర్ కీ రిలేషన్ ఏర్పడింది. ఏమిటా సంభందం అంటే వికీలీక్స్‌ అన్న జర్మన్‌ పదాన్ని తెలుగులోకి అనువదిస్తే 'ఎన్టీఆర్‌' అని చూపిస్తోంది. ఇది విన్న చాలా మంది గూగుల్‌ అనువాదంలోకి వెళ్లి చెక్ చేస్తున్నారు. అందులో వికీలీక్స్‌ అన్న పదాన్ని ఆంగ్లంలో టైప్‌ చేసి తెలుగులోకి అనువదించమంటే 'ఎన్టీఆర్‌'అనే వస్తోంది మరి. దీంతో అంతర్జాలికులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పొరపాటు జరిగిఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సినిమా వాళ్లు అయితే దీన్ని ఓ ప్రత్యేక వార్తగా ఎస్.ఎమ్మెస్ లతో షేర్ చేసుకుంటున్నారు. మీడియా కూడా ఈ విషయమై ఆసక్తి చూపించటంతో ఈ టాపిక్ సినీ సర్కిల్స్ లో నలుగుతోంది.

    ఇక పెద్ద ఎన్టీఆర్ లేక చిన్న ఎన్టీఆర్ అనేది ప్రక్కన పెడితే ఇదో విచిజత్ర వార్తే. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఊసరివిల్లి బిజీలో ఉన్నారు. తమన్నా కథానాయిక. సురేందర్‌రెడ్డి దర్శకుడు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలోనే పాటల్ని విడుదల చేస్తారు. అక్టోబరు 6న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించే చిత్రమిది. పోరాటాల్లోనూ, నృత్యాల్లోనూ ఆయన శైలి కనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఆరు హుషారైన బాణీలు అందించారు. ఈ నెల రెండోవారంలో పాటల్ని విడుదల చేస్తామ''ని చెప్పారు. 'కిక్‌' శ్యామ్‌ కీలక పాత్రధారి. తనికెళ్ల భరణి, ఆద్విక్‌ మహాజన్‌, మురళీ శర్మ, ఆహుతి ప్రసాద్‌, ఎమ్మెస్‌ నారాయణ, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌.

    English summary
    Oosaravelli is an upcoming Telugu that stars Jr Ntr and Tamanna in the lead roles. The film will be directed by Surender Reddy and produced by Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X