For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలయన్స్-అన్నపూర్ణ స్టూడియో ఇకపై కంబైన్డ్

    By Bojja Kumar
    |

    దేశంలోనే పేరెన్నికగన్న రిలయన్స్ సంస్థతో అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ చేతులు కలిపింది. రిలయన్స్ మీడియా వర్క్, అన్నపూర్ణ స్టూడియోలు ఇకపై ఒకే గొడుకు కింద ఉండి సంయుక్తంగా సేవలు అందించనున్నాయి. లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు స్థాపించిన ఈ అన్నపూర్ణ స్టూడియో ఇప్పటి వరకు సినిమాలకు స్టేజీలు, సౌండ్, ఔట్ డోర్ సెట్స్, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ తదితర ప్రొడక్షన్ సౌకర్యాలు కల్పిస్తూ వచ్చింది. రిలయన్స్ సంస్థతో చేతులు కలపడం ద్వారా మరిన్ని అత్యాధునిక సౌకర్యాలు అందించే స్టూడియోగా మారనుంది.

    రిలయన్స్ వారితో కలిసి పని చేయడం ద్వారా...మరిన్ని సౌకర్యాలు అందిపుచ్చుకుని ప్రపంచ స్థాయి స్టూడియోగా అన్నపూర్ణ స్టూడియో రూపాంతరం చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అక్కినేని నాగేశ్వరరావు. అన్నపూర్ణ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన నాగార్జున మాట్లాడుతూ...రిలయన్స్ మీడియా వర్క్ వారితో కలిసి పని చేయడం ఆనందం ఉందని, సూడియో భవిష్యత్ రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. అన్నపూర్ణ స్టూడియో వారితో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు రిలయన్స్ మీడియా వర్క్స్ సీఈఓ అనిల్ అర్జున్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియో ద్వారా దక్షిణ భారత దేశంలో మా ఉనికిని బలోపేతం చేసుకోవడానికి దోహద పడుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.

    English summary
    Reliance Media Works Limited has joined hands with Hyderabad-based Annapurna Studios to manage and operate their studio facility.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X