ప్రభాస్‌ ఇంటిని కూల్చవద్దు.. యంగ్ రెబల్ స్టార్‌కు ఊరట

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌కు ఇంటి కూల్చివేత వ్యవహారంలో హైకోర్టులో ఊరట లభించింది. ఇంటి కూల్చివేతకు వీలు లేదని కోర్టు వెల్లడిస్తూ.. ఈ వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని దిగువ కోర్టుకు ఆదేశాలిచ్చింది. అక్రమ భూముల్లో ప్రభాస్ ఇంటి నిర్మాణం జరిపారని, కోర్టు వివాదంలో నానుతున్న భూమిని కొనుగోలు చేశారనే విషయంపై గత కొద్దికాలంంగా వివాదం నెలకొని ఉంది. అయితే ప్రభాస్ ఇంటిపై మున్సిపల్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎత్తివేయాలని ప్రభాస్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన ఇంజెక్షన్ ఆర్డర్‌ను ఇటీవల తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆ కేసు వివరాల్లో హైకోర్టు ఏం చెప్పిందంటే..

వివాదంగా ప్రభాస్ ఇంటి నిర్మాణం

వివాదంగా ప్రభాస్ ఇంటి నిర్మాణం

హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పరిధిలో ప్రభాస్ సుమారు 2083 గజాల స్థలంలో ఇల్లుకట్టుకొన్నారు. అయితే నియమాలకు విరుద్దంగా ఇంటి నిర్మాణం జరిగింది. అనుమతి లేని స్థలంలో ఇంటి నిర్మాణం జరుగడం చట్ట వ్యతరేకం. కాబట్టి ఇంటిని కూల్చివేయాలని గతలో మున్సిపల్ అధికారులు ప్రయత్నించడంతో ప్రభాస్ కోర్టును ఆశ్రయించారు.

వివాదస్పద భూముల్లో

వివాదస్పద భూముల్లో

ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసే ముందు అన్నీ డాక్యుమెంట్లు పరిశీలించాం. గతంలో ఈ సర్వే (సీఎస్7 1958 నిజాం భూముల) నంబర్‌లోని భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవని తెలియదు. అయితే భారీ మొత్తంలో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటిని నిర్మించుకొన్నాం. ప్రభుత్వ అనుమతులతోనే మేము ఇంటి నిర్మాణం జరిపించాం. కాబట్టి ఇంటిని కూల్చకూడదని విషయంపై వాదోపవాదనలు జరిదాయి.

ఇంటిలోకి వెళ్లే విధంగా

ఇంటిలోకి వెళ్లే విధంగా

ఇలాంటి వాదనల మధ్య ఇటీవల తనను ఇంటిలోకి వెళ్లే విధంగా అనుమతులు ఇవ్వాలని ప్రభాస్ తరఫు న్యాయవాది కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాస్ బలవంతంగా ఇంటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఆ పిటిషన్ సవాల్ చేస్తూ హైకోర్టును అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అంతేకాకుండా ఇరుపార్టీలకు కొన్ని సూచనలు చేసింది.

Recommended Video

Irrfan Khan To Act Prabhas And Nag Ashwin's Movie But We Missed Him In Second Telugu Movie
ప్రభాస్ ఇంటిని కూల్చొద్దు.. అలాగే ఇంటిలోకి వెళ్లొద్దు

ప్రభాస్ ఇంటిని కూల్చొద్దు.. అలాగే ఇంటిలోకి వెళ్లొద్దు

కోర్టు పేర్కొన్న ప్రకారం.. ప్రభాస్ ఇంటిని కూల్చివేయడానికి అవకాశం లేదు. అలాగే ప్రభాస్ తాను నిర్మించుకొన్న ఇంటిలోకి వెళ్లడానికి హక్కు లేదు. కోర్టులో సరైన తీర్పు వచ్చే వరకు రెండు పార్టీలు సంయమనం పాటించాలి. ఈ వ్యవహారంపై ట్రయల్ కోర్టులు బాధితుడి పిటిషన్‌ను విచారించాలని సూచించింది. దీంతో మళ్లీ ప్రభాస్ ఇంటి వివాదం ట్రయల్ కోర్టుకు చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X