twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మత విశ్వాసాలను కించపరిచారచలేదంటూ వివరణ

    By Srikanya
    |

    ముంబై : పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై పలుచోట్ల నిరసన గళం వినిపిస్తోంది. ఇందులో మత విశ్వాసాలను కించపరిచారని నిరసనకారుల వాదన. అయితే తాము ఎవరి మత విశ్వాశాలను కించపరచలేదంటూ పరేష్ రావెల్ వివరణ ఇచ్చారు.

    పరేష్ రావెల్ మాట్లాడుతూ... ''వెయ్యి మంది ప్రేక్షకులు చూస్తున్నప్పుడు ఈ నాటకాన్ని ప్రదర్శించాం. అలా 150 ప్రదర్శనలు గుజరాతీ భాషలోనూ, హిందీలోనూ ఇచ్చాం. ఆ తరవాత పంజాబీ, ఇంగ్లిష్‌ల్లోనూ చాలాసార్లు ప్రదర్శించాం. అయితే ఎక్కడా ఎవరూ నిరసన వ్యక్తం చేయలేదు. మేం చేస్తున్నది తప్పు అనిపిస్తే... అప్పుడే అక్కడి ప్రేక్షకులు స్టేజీ మీదకు చెప్పులేసేవాళ్లు కదా! ఈ సినిమాలో దేవుణ్ని నమ్మని పాత్రలో నేను నటించాను. కానీ నిజ జీవితంలో మాత్రం దైవం ఉందనే నమ్ముతాను''ని వెల్లడించారు. అక్షయ్‌కుమార్‌తో కలిసి పరేష్‌ రావల్‌ 'డియర్‌ ఫాదర్‌' అనే నాటకాన్ని కూడా వెండి తెర మీదకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

    'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

    భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'ఓ మై గాడ్‌'లో అక్షయ్ ఆధునిక శ్రీకృష్ణునిగా కనిపించాడు. పరేష్‌రావల్‌ ఓ కీలక పాత్ర చేసిన ఈ సినిమాని అశ్వనీ యార్ది దర్శకత్వం వహించగా గ్రేజింగ్‌ గోట్‌బ్యానర్‌పై అక్షయ్ స్వయంగా నిర్మించాడు. ఈ కథ ప్రధానంగా నాస్తికుడిగా నటిస్తున్న పరేష్‌రావల్‌ చుట్టూ నడుస్తుంది. ఓ కేసు విషయమై అతను శ్రీకృష్ణుడిని ఎలా కోర్టుకి లాగుతాడు, కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడన్నది కథ. ఓ గుజరాతీ నాటకం దీనికి ఆధారం. తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి నిర్మాత కృష్ణప్రసాద్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఆయనతో పాటు అక్షయ్, యార్ది కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశా లున్నాయి.

    English summary
    "Religion is a touchy issue in India, yet the play has been running successfully for so many years without any problem. That's because 'Oh My God' script has been written so cleverly that everything has been taken care of. A lot of religious heads of various religious institutions have seen the play and loved it. It's not hurting the sentiments of anyone or any religion, it just questions whether what we do in the name of God or religion is right or wrong" says Paresh Rawal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X