twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మమ్మల్ని నాశనం చేయకండి మహా ప్రభో...

    By Staff
    |

    Anthu Inthu Preethi Banthu
    కర్ణాటక గవర్నమెంట్ రీమేక్ చిత్రాలకు ఎంటర్ టైన్ మెంట్ టాక్స్ లో ఎగ్జమ్షన్ ప్రకటించాక అక్కడ రీమేక్ సినిమాల నిర్మాణం ఊపందుకుంది. అయితే ఆ చిత్రాల్లో ఎక్కువ భాగం తెలుగు నుండి దిగుమతి అయ్యేవే కావటం గమనార్హం. వాటిల్లో మా నాన్నకు పెళ్ళి (విష్ణు వర్ధన్ తో చేస్తున్నారు) వంటి పాత చిత్రాలే గాక పోకిరి (దర్శన్ హీరోగా), దుబాయి శీను (ఉపేంద్ర హీరోగా),రెడీ(పునీత్ రాజ్ కుమార్ హీరోగా),ఢీ,ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఇలా ఈ వరస కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ ట్రెండు ని చూసి అక్కడ సీనియర్స్ కంగారు పడుతున్నారు.

    తమ దైన నేటివిటీ మిస్సవుతుందని,కథా రచయితలుకు ఆదరణ కొరవడుతోందని ,దాంతో వారు వేరే వ్యాపకాలు ఎతుక్కునే పరిస్ధితి వస్తుందని పరిశ్రమ పాక్షిక నిరుద్యోగానికి లోనవుతుందని ఆందోళనపడుతున్నారు. అయితే రీమేక్ చేస్తున్న దర్శక,నిర్మాతలు మాత్రం ఈ ట్రెండు వ్యాపారప్రయోజనాల దృష్టా బాగా ఉపకరిస్తుందని చెప్తున్నారు. అంతేగాక అక్కడ మన రచయితలు (జనార్దన మహర్షి వంటి వారు),దర్శకులు,నిర్మాతలు తమ ప్రస్ధానాన్ని కొనసాగించటాన్ని తీవ్రంగానే స్పందిస్తున్నారు.

    తమ కన్నడ ఫీల్డుని తెలుగు పరశ్రమలో రిటైరైన లేదా ఫెయిల్యూర్ అయిన వారికి పునరావాసంగా మారటాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వం ద్వారా చర్య తీసుకోవాలా లేదా తమ పరిశ్రమ అంతర్గత సమస్యగా పరిగణించాలా అని తలపోస్తున్నారు. అయితే ఈ పరిమాణాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై వారి వద్ద స్పష్టమైన ప్రణాళిక లేదు. రీమక్ లను నిషేధించినా ఫ్రీమేక్ లు చేసేయటం చిత్ర సీమలో ఆనవాయితీ అన్న సంగతి వారికి తెలిసిందే.ఇక ఇప్పటికే అక్కడ పర భాషా చిత్రాల డబ్బింగ్ పై నిషేధం ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X