»   » చిరంజీవి కూతురికి మళ్లీ పెళ్లి? అంటూ గుసగుసలు...

చిరంజీవి కూతురికి మళ్లీ పెళ్లి? అంటూ గుసగుసలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సెన్నేషన్. అయితే వీరి వివాహ బంధం ఎంతో కాలం నిలవలేదు. ఓ బిడ్డకు తల్లయిన తర్వాత ఆమె శిరీష్‌తో విడిపోయింది. శిరీష్ తనను హింసిస్తున్నాడని, కలిసి బతకలేనని విడాకుల కోసం శ్రీజ కోర్టు కెక్కడం, విచారన అనంతరం కోర్టు విడాకులు మంజూరుచేయడం చకచకా జరిగిపోయింది.

కొన్ని నెలల క్రితం రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పంక్షన్లో శ్రీజ కనిపించింది. తర్వాత ఆమె విదేశాలక షిప్టయినట్లు సమాచారం. శిరీష్ మూలంగా నిజ జీవితంలో పీడకల అనుభవించిన శ్రీజ ప్రస్తుతం ఆ జ్ఞపకాల నుండి పూర్తిగా బయట పడిందని, త్వరలో ఆమెకు మరో వివాహం చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తున్నట్లు, శ్రీజ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Remarriage for Chiranjeevi’s daughter?

ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ, ఈ గుసగుసలు విన్న అభిమానులు మాత్రం శ్రీజ మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు.

English summary
Film Nagar gossip is that, Remarriage for Chiranjeevi’s daughter Srija.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu