ఎన్నో రాత్రలొచ్చాయి గాని...

అక్కడ ఎవరికైనా మూడ్ వచ్చేలా పచ్చని చెట్లు,గిలక బావి,ఎడ్లబండి...నిండు చంద్రుడు...నులకమంచం కూడా ఉంటాయి. అలాగే ఈ రొమాంటిక్ సాంగ్ లో స్నేహ ఇప్పటి వరకూ కనిపించనంత గ్లామరస్ గా కనిపించటం విశేషం. అంతే గాక శ్రీకాంత్ దేవా సంగీతం వహిస్తున్న ఈ ద్వి భాషా సినిమాలో భారీ అందాల నమిత కూడా కనువిందు చేస్తుందిట. అలాగే తమిళ వెర్షన్ లో రజనీకాంత్ ,గౌతమి చేసిన ధర్మదురై సినిమా లోని 'మాసీ మాసం...ఆళాన పొన్ను 'అనే సాంగ్ ఈ ప్లేస్ లో వస్తుందిట. 'ముని' చిత్రాన్ని తీసిన మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక లారెన్స్ ఈ సినిమా వరస ఫ్లాపుల్లో ఉన్న తన కెరీర్ కి ఊరట నిస్తుందని ...ఊపు తెస్తుందని భావిస్తున్నాడట.


Click it and Unblock the Notifications











