ముద్దంటే చేదు కాదు మోజే అంటున్న నాగార్జున
నాగార్జున తాజాగా 'ము..ము..ముద్దంటే చేదా' అంటూ పాటెత్తున్నారు. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, విజయలలితపై 'అదృష్టవంతుడు' చిత్రం కోసం చిత్రీకరించిన ఈ పాటని నాగార్జున లేటెస్ట్ చిత్రం కేడీ కోసం రీమిక్స్ చేస్తునన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్‌లో నాగార్జున, బాలీవుడ్ అమ్మాయి మహెక్‌లపై ఆ రీమిక్స్ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు డాన్స్ డైరక్టర్ ప్రేమ్ రక్షిత్ నృత్యరీతుల్ని సమకూరుస్తున్నారు. ఇక 'కేడి' చిత్రం ద్వారా కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అలాగే నాగార్జున సరసన మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ విషయాన్ని నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పుకొచ్చారు. ఆయన ఈ మాట్లాడుతూ 'అక్కినేని నాగేశ్వరరావు అభిమానిగా నాకెంతో నచ్చిన గీతం 'ము ము ముద్దంటే చేదా'. దీన్ని రీమిక్స్ చేసి నాగార్జునపై చిత్రించడం తమాషాగా ఉంది. ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుంది. 'కింగ్' తరవాత నాగ్‌ని కొత్త శైలిలో చూపిస్తున్నాం. కార్ల దొంగతనాలు, గాంబ్లింగ్...ఇవన్నీ కథలో వస్తాయన్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని సందీప్ చౌతా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











