ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇంట్లో విషాదం.. అనుమానాస్పద మరణంతో ఫ్యామిలీ దిగ్బ్రాంతి
బాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా కుటుంబంలో విషాదం చోటుచేసుకొన్నది. రెమో పనిచేసిన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన జాసన్ వాట్కిన్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. జాసన్ వాట్కిన్ స్వయంగా రెమోకు బావమరిది కావడ గమనార్హం. రెమో ఇంటిలో చోటు చేసుకొన్న విషాద ఘటన నేపథ్యంలో పలువురు బాలీవుడ్ నటులు సంతాపంతోపాటు ఫోనులో పరామర్శించారు. ఈ అనుమానాస్పద మరణం వెనుక వివరాల్లోకి వెళితే..

జాసన్ మరణంతో
బాలీవుడ్ డైరెక్టర్, కోరియోగ్రాఫర్ రెమో డిసౌజా భార్య లీజెల్లా డిసౌజాకు జాసన్ వాట్కిన్ సోదరుడు. పలు బాలీవుడ్ చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రముఖ కోరియోగ్రాఫర్లు సరోజ్ ఖాన్, తదితరులతో పనిచేశారు. అయితే ఎప్పుడూ చలాకీగా ఉండే జాసన్ ఇక లేరంటే నమ్మశక్యంగా లేదంటూ బాలీవుడ్ ప్రముఖులు షాక్ గురయ్యారు.

జీవితంలో క్షమించం అంటూ
జాసన్ మరణం తర్వాత రెమో భార్య లిజెల్లా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూ.. ఎందుకు ఇలా చేశావు. ఇలాంటి ఘోరానికి ఎలా పాల్పడ్డావు. నీవు లేవనే విషయం తెలిసినా తర్వాత నేను ఏం సమాధానం చెప్పుకోవాలి. నిన్ను జీవితంలో ఎన్నడూ కూడా క్షమించను అంటూ భావోద్వేగంతో పోస్టు పెట్టారు.

మరణవార్త తెలిసిన సమయంలో గోవాలో
జాసన్ వాట్కిన్ మరణవార్త తెలిసిన సమయంలో రెమో డిసౌజా తన ఫ్యామిలీతో కలిసి గోవాలో ఓ పెళ్లి వేడుకలో ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే రెమో వెంటనే గోవా నుంచి ముంబైకి చేరుకొన్నారు. జాసన్ మరణానికి దారి తీసిన పరిస్థితులపై కుటుంబం దృష్టి పెట్టింది. జాసన్ మరణానికి కారణం ఏమిటని కూపీ లాగుతున్నారు.

ముంబైలో కేసు నమోదు..
జాసన్ మరణం నేపథ్యంలో ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని చెప్పారు. జాసన్ పార్ధీవ దేహాన్ని ముంబైలోని కూపర్ హాస్పిటల్‌కు తరలించి న్యాయపరమైన ప్రోసిజర్స్ చేపట్టారు.


Click it and Unblock the Notifications











