twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురేష్ కొండేటి డబ్బింగ్ చేస్తున్న 'రేణిగుంట' కథేంటి?

    By Srikanya
    |

    ప్రేమిస్తే, షాపింగ్‌ మాల్‌, నాన్న వంటి డబ్బింగ్ చిత్రాల ద్వారా నిర్మాతగా ఎదుగుతున్న సురేష్ కొండేటి తాజాగా మరో తమిళ చిత్రం రైట్స్ కొన్నారు. 'రేణిగుంట' టైటిల్ తో తమిళంలో వచ్చిన ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. ఆ చిత్రం కథ ఇలాసాగుతుంది. 'తల్లిదండ్రులతో ఆనందంగా జీవించే ఓ యువకుడి జీవితంలో అనుకోని ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన అతని జీవితాన్ని మార్చేస్తుంది. ఆయువకుడి తల్లిదండ్రులు హత్యకు గురవుతారు. ఆ షాక్‌ నుంచి తేరుకునే లోపు ఆ యువకుడిపై నింద వేసి జైలుపాలు చేస్తారు దుండగులు.

    జైలులో నలుగురు క్రిమినల్స్‌తో ఈ యువకుడికి స్నేహం కుదురుతుంది. తన తల్లిదండ్రులను చంపిన వారిపైపగ తీర్చుకోవడానికి ఆ యువకుడికి ఈ నలుగురు క్రిమినల్స్‌ సహాయం చేస్తారు. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్లుగా మారడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆనంతరం జరిగిన పరిణామాలేంటి? యువకుడి తల్లిదండ్రులను చంపిందెవరు? అతన్ని జైలుపాలు చేసిందెవరు? అనే అంశాలతో ఈచిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. లవ్ యాక్షన్‌ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: గణేష్‌ రాఘవేంద్ర, కెమెరా: శక్తి, ఎడిటింగ్‌: ఆంథోని. జానీ, సనూష, నిశాంత్‌ కాంబినేషన్‌లో పన్నీర్‌ సెల్వం దర్శకత్వంలో ఈచిత్రం రూపొందింది.

    English summary
    Kollywood's much acclaimed crime thriller Renigunta, directed by Panneerselvam is being dubbed in Telugu. Producer Suresh Kondeti has bagged the rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X