ఏదేదో ఊహించుకోకండి.. సమయం వస్తే చెబుతాను.. రేణూ దేశాయ్ కామెంట్స్ వైరల్

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె చేసే పోస్టుల్లో ఎక్కువగా తన పిల్లల గురించే చెబుతూ ఉంటుంది. అకీరా నందన్, ఆద్యల గురించి రేణూ దేశాయ్ చేసే పోస్ట్‌లు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఒక్కోసారి మాత్రం ఆ పోస్ట్‌లకు వచ్చే కామెంట్లను రేణూ దేశాయ్ తట్టుకోలేకపోతోంది. అలా కొన్ని సందర్భాల్లో సదరు పోస్ట్‌కు కామెంట్లను ఆఫ్ చేస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది.

బికినీ అందాలతో మత్తెక్కిస్తోన్న ఇషా ఛబ్రా

 అడివి శేష్‌తో అలా..

అడివి శేష్‌తో అలా..

అడివి శేష్ అంటే అకీరా నందన్‌కు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి బాస్కెట్ బాల్ ఆడుతూ లోకాన్ని మరిచిపోతారు. రేణూ దేశాయ్ ఫ్యామిలీ ఎక్కువగా అడివి శేష్‌తో క్లోజ్‌గా ఉంటుంది. ఇక ఆద్య, అకీరాలు ఎక్కువగా అడివి శేష్ అంటేనే ఇష్టపడుతారు. తాజాగా ఈ ముగ్గురూ ఉన్న ఫోటోను రేణూ దేశాయ్ షేర్ చేసింది.

మేజర్ టీజర్..

మేజర్ టీజర్..

అడివి శేష్ మేజర్ టీజర్ సందర్భంగా రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేసింది. అందులో అడివి శేష్, ఆద్య, అకీరాలు ఉన్నారు. అయితే అకీరా మాత్రం తన ఫేస్‌కు మాస్క్ ధరించి ఉన్నాడు. ఈ ఫోటో నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఇక అకీరాను అలా చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊరికే ఉండలేదు.

ఒక్క ఫోటో..

ఒక్క ఫోటో..

అకీరాది మాస్క్ లేకుండా ఒక్క ఫోటో అయినా పెట్టండి అంటూ నెటిజన్లు రేణూ దేశాయ్‌ను కోరారు. అకీరాకు అలాంటివి అంటే సిగ్గు.. ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టనివ్వడు అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అకీరాలాంటి కొడుకు ప్రతీ ఇంట్లో ఉండాలి.. అకీరాలానే కొడుకులను పెంచాలి అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించగా రేణూ దేశాయ్ మురిసిపోయింది.

కళ్ల గురించి కామెంట్..

కళ్ల గురించి కామెంట్..

కొందరు నెటిజన్లు అకీరా కళ్ల గురించి కామెంట్ చేశాడు. ఆ కళ్లు చూడండిరా ఏమున్నాయ్ అంటూ కామెంట్లు చేయగా.. అది నా పోలిక అంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. కానీ అవి పవన్ కళ్యాణ్‌లా ఉన్నాయంటూ అందరూ కామెంట్ చేయసాగారు.

అకీరా ఎంట్రీ..

అకీరా ఎంట్రీ..

మేజర్ సినిమా గురించి రేణూ దేశాయ్ మాట్లాడటం, ఇలా అడివి శేష్‌తో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో ఓ నెటిజన్ వెరైటీగా స్పందించాడు. అంటే అకీరా మేజర్ సినిమాలో నటిస్తున్నాడా? అని కామెంట్ చేశాడు. లేదు.. మీది మీరు ఏదో ఊహించుకుని ప్రచారం చేయకండి.. అకీరా నటన మొదలు పెడితే.. ఎంట్రీ ఇస్తే నేనే ముందు మీకు చెబుతాను అని రేణూదేశాయ్ స్పందించింది.

కామెంట్లు ఆఫ్..

కామెంట్లు ఆఫ్..

అకీరాకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ అవుతుండటం, నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉండటంతో విసుగెత్తిపోయిన రేణూ దేశాయ్ మొత్తానికే కామెంట్లను టర్న్ ఆఫ్ చేసింది. అలా చేస్తే ఏ గోల ఉండదనిని రేణూ దేశాయ్ భావించినట్టుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X