Akira Nandan: బాక్సింగ్ పంచ్ లతో దడ పుట్టిస్తున్న Jr పవర్ స్టార్.. హీరోగా ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక అభిమానులు ఉన్న టాప్ హీరోలలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఆయన కుమారుడు అకీరా నందన్ పైనే ఉంది. అకీరానందన్ సినిమాల్లో హీరోగా కనిపిస్తే చూడాలని ఉంది అని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నేడు అకీరా నందన్ 18వ వసంతంలోకి అడుగు పెట్టడంతో రేణు దేశాయ్ ప్రత్యేకంగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ పై వస్తున్న వార్తలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎన్ని అపజయాలు వచ్చినా..

ఎన్ని అపజయాలు వచ్చినా..

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటాయి. బాక్సాఫీస్ వద్ద ఎన్ని అపజయాలు వచ్చినా కూడా ఆయన మార్కెట్ కొంచెం కూడా తగ్గలేదు. ఒక విధంగా సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ కూడా అంతగా పెరుగుతుంది.

అతని ఎంట్రీ కోసం..

అతని ఎంట్రీ కోసం..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ జూనియర్ పవర్ స్టార్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం ఖాయమని అభిమానులు కూడా చాలా బలంగా నమ్ముతున్నారు. అతని ఎంట్రీ కోసం అయితే వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అని చెప్పవచ్చు. ఒక విధంగా అఖిరా ఎంట్రీ వస్తే మాత్రం అభిమానులు అతనికి బ్రహ్మరథం పట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

అంచనాలు ఒక రేంజ్ లో..

అంచనాలు ఒక రేంజ్ లో..

చిత్ర పరిశ్రమలో సాధారణంగా స్టార్ హీరోల వారసులపై అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడిపై అయితే అంతకు మించి అనేలా అంచనాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. కానీ ఇంతవరకు అకీరా నందన్ సినిమాల కోసం సిద్ధమవుతున్నట్లుగా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది అయితే లేదు.

స్పెషల్ పోస్ట్

స్పెషల్ పోస్ట్

ఇక నేడు అకీరా నందన్ పద్దెనిమిదవ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ స్పెషల్ గా ఒక ప్రత్యేకమైన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అతను ఒక మంచి సోదరుడు మంచి స్నేహితుడు అలాగే జెంటిల్మెన్ అంటూ అఖిరా నెటీతో అడల్ట్ అయ్యాడని అతని మంచితనం గురించి వివరణ ఇచ్చారు.

పంచ్ లతో షాక్ ఇచ్చిన అకీరా నందన్

ఇక వీడియో లో అకీరా నందన్ బాక్సింగ్ పంచులతో షాక్ ఇచ్చాడు అని చెప్పాలి. అసలే ఈ రోజు అకీరా నందన్ అన్నయ్య వరుణ్ తేజ్ గని సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. అకీరా నందన్ కూడా అదే తరహాలో బాక్సింగ్ పంచ్ లతో ఆశ్చర్యపరచడం విశేషం.

అఖిరా ఎంట్రీపై క్లారిటీ

అఖిరా ఎంట్రీపై క్లారిటీ

ఇక అకీరా నందన్ టాలీవుడ్లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని అతను ఒక సినిమాకు కూడా సైన్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక రేణు దేశాయ్ వెంటనే ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చేశారు. అతనికి యాక్టర్ అవ్వాలి అని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని ఇంతవరకు ఎలాంటి సినిమా చేసేందుకు సంతకం చేయలేదు అని ఎవరు కూడా రూమర్స్ ను నమ్మవద్దని ఆమె తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X