రేణు దేశాయ్ ప్రేమ కవిత్వంపై పవన్ ప్రభావం.. 'ఏ లవ్ అన్ కండిషనల్' అంటూ!
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ పుణేలో తన పిల్లలతో నివసిస్తున్న సంగతి తెలిసిందే. పవన్, రేణు దేశాయ్ కి అకిరా, ఆధ్య సంతానం ఉన్నారు. బద్రి చిత్రంతో పరిచమైన వీరిద్దరి ప్రేమ, పెళ్లి ఆ తరువాత విడిపోవడం గురించి అందరికి తెలిసిందే. కానీ ఎలా విడిపోయారు అనేది మాత్రం వారిద్దరికే సంబంధించిన వ్యక్తిగత విషయం. ఇదిలా ఉండగా రెండు దేశాయ్ రచయితగా, దర్శకురాలిగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మధ్యలో కొన్ని కవితలు కూడా రాస్తున్నారు. ఇటీవల రెండు దేశాయ్ రాసిన 'ఏ లవ్ అన్ కండిషనల్ అనే ప్రేమ కవితల పుస్తకంపై చర్చ జరుగుతోంది.

ప్రేమ గురించి
రేణు దేశాయ్ ఏ లవ్ అన్ కండిషనల్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాసింది. దీనిని ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తెలుగులోకి అనువదించారు. రేణు దేశాయ్ రాసిన ఈ పుస్తకానికి, పవన్ కళ్యాణ్ కు లీక్ పెడుతూ పెద్ద చర్చే జరుగుతోంది. రేణు దేశాయ్ ఈ పుస్తకంలో ఎక్కడా పవన్ పేరు కానీ, మరొకరి పేరు కానీ ప్రస్తావించలేదు. అయినా కూడా రేణు రచనలపై పవన్ ప్రభావం ఉందా అని చర్చించుకుంటున్నారు.

12 ఏళ్లే కదా
ఈ చర్చపై రేణు దేశాయ్ ఆఫ్ ది రికార్డ్ ముఖాముఖిలో స్పందించిందట. నేను పవన్ కళ్యాణ్ తో ఉన్నది 12 ఏళ్ళు మాత్రమే. ఆయన ప్రభావం నామీద ఎలా ఉంటుంది అని తెలిపింది. తనమనసులో మెదిలిన అందమైన భావాల్ని కవిత్వాలుగా మలిచానని రేణు దేశాయ్ చెబుతోంది. రేణు దేశాయ్ అద్భుతంగా రచించారని ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన అనంత్ శ్రీరామ్ అన్నారు.

దర్శకురాలిగా
రేణు దేశాయ్ రచయితగా మాత్రమే కాదు.. దర్శకురాలిగా కూడా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరాఠీలో ఆమె కొన్ని చిత్రాలని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మరాఠీలో ఇష్క్ వాలా లవ్ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటారు. తన పిల్లల విశేషాలని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు.

రెండో వివాహం
రేణు దేశాయ్ ప్రస్తుతం సెకండ్ మ్యారేజ్ కు సిద్ధం అవుతున్నారు. కొన్ని నెలల క్రితం రేణు దేశాయ్ నిశ్చితార్థం కూడా జరిగింది. తనకు కాబోయే భర్త వివరాలని రేణు దేశాయ్ గోప్యంగా ఉన్నారు. రేణు రెండవ వివాహం సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బద్రి చిత్రంలో కలసి నటించిన పవన్, రేణు 2009లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2013లో వీరిద్దరూ అధికారికంగా విడిపోయారు.


Click it and Unblock the Notifications











