»   » రేణు దేశాయ్ మరో పెళ్లి థాట్స్: కాబోయే వాడిపై జాలి, పవన్‌ మిస్టరీ వీడేది అప్పుడే!

రేణు దేశాయ్ మరో పెళ్లి థాట్స్: కాబోయే వాడిపై జాలి, పవన్‌ మిస్టరీ వీడేది అప్పుడే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులుగానీ, తెలుగు సినీ ప్రేక్షకులుగానీ అసలు ఊహించని అంశం... పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడాకుల అంశం. అసలు వీరి మధ్య విడిపోయేంత పెద్ద కారణం ఏమిటి? అనేది ఇప్పటికీ మిస్టరీనే. అసలు ఆ ఇద్దరికీ తప్ప విడాకులకు కారణం ఏమిటనేది మూడో వ్యక్తికి తెలియదు.

  ఇటీవల ఉమెన్స్ డే ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఈ అంశం కూడా స్పందించారు. తాము విడిపోయినా ఇంకా స్నేహితులుగానే ఉంటున్నామని తెలిపారు. అయితే విడాకులు తీసుకునేందుకు గల కారణం మాత్రం ఆమె చెప్పలేదు. తన ఆటోబయోగ్రఫీలోనే ఆ విషయం బయట పెడతాను, అప్పటి వరకు అది మిస్టరీగానే ఉంటుందని ఆమె తెలిపారు.

  ఇప్పటి మగాళ్లతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్

  ఇప్పటి మగాళ్లతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్

  ఇప్పటి మగాళ్లతో పోల్చుకుంటే కళ్యాణ్ గారు చాలా ప్రోగ్రెసివ్. అలా అని నేను ఆయన్ను ఎవరితోనూ కంపేర్ చేయడం లేదు. హి ఈజ్ మై గురూజీ. ఆయన వద్ద నాకు నచ్చే అంశాలు హానెస్టీ, హార్డ్ వర్క్, మంచి తనం అని రేణు దేశాయ్ తెలిపారు.

  బ్యాడ్ గా మాట్లాడటానికి ఏమీ లేదు

  బ్యాడ్ గా మాట్లాడటానికి ఏమీ లేదు

  పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా మాట్లాడటానికి ఏమీ లేదు. డైవర్స్ అలా జరిగిపోయింది. డైవర్స్ తర్వాత కూడా ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటున్నాం. ఒకరంటే ఒకరికి ఇష్టం, నమ్మకం అలానే ఉన్నాయి. ఆయన పిల్లలను చూడటానికి పూనా వస్తారు, మాట్లాడుకుంటాం, గంటలు గంటలు మాట్లడతారు. రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోతారు. మేము అలా మాట్లాడుకోవడం చూసి మా స్నేహితులు ఎందుకు విడిపోయారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. మా మధ్య విడాకులకు గల కారణాన్ని నా ఆటోబయోగ్రఫీలోనే బయట పెడతాను అని రేణు దేశాయ్ తెలిపారు.

  మంచి ఫాదర్

  మంచి ఫాదర్

  పవన్ కళ్యాణ్ గారు మంచి ఫాదర్. అకీరా, ఆయన కలిసినప్పుడు సినిమాల గురించి అస్సలు మాట్లాడుకోరు. బుక్స్ గురించి, లైఫ్ గురించి మాట్లాడతారు. అకీచా చాలా మెచ్యూర్డ్... నాన్న చెప్పే విషయాలను బాగా అర్థం చేసుకుంటాడు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

  నాన్న లేని లోటును

  నాన్న లేని లోటును

  ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో ఆయన ఎప్పుడూ పిల్లలతో ఉండటం కుదరదు. అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెలుతుంటారు. నాన్న ఎందుకు రావడం లేదని పిల్లలు అడుగుతారు. నాన్నకు సినిమా ఉంది, షూటింగ్ ఉంది అని కన్విన్స్ చేస్తుంటాను. కానీ మా కూతురు ఆద్య... మమ్మీ నువ్వు కూడా సినిమాలు చేస్తున్నావు కదా, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, నాన్న ఉందుకు ఉండటం లేదని అడుగుతూ ఉంటుంది. పిల్లలను కొన్ని సార్లు కన్విన్స్ చేయడం కూడా కష్టం అవుతుంది అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

  మరో వివాహం చేసుకోవడం

  మరో వివాహం చేసుకోవడం

  మేము విడిపోయి ఇప్పటికి ఐదేళ్లవుతుంది. మరో పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేను, చేసుకోను అని చెప్పలేను. నాకు నచ్చిన వాడు దొరికితే తప్పకుండా చెబుతాను. నాకు కూడా ఒక తోడు ఉంటే బావుంటుంది అనే ఆలోచన అప్పుడప్పుడు వస్తుంది. పిల్లలు ఇంట్లో లేనప్పుడు లోన్లీ ఫీలింగ్ వస్తుంది అని రేణు దేశాయ్ అన్నారు.

   రెండో పెళ్లి విషయమై పవన్ కళ్యాణ్ తో

  రెండో పెళ్లి విషయమై పవన్ కళ్యాణ్ తో

  పవన్ కళ్యాణ్‌తో గారితో కూడా ఒకటి రెండు సార్లు రెండో పెళ్లి విషయమై డిస్కషన్ చేసాను. ఇయనతో ఇలాంటి మాట్లాడటం నాకు ఇబ్బంది కరమైనదే. అయితే ఆయన మాత్రం చాలా మంచి వారు, నా ఆలోచనలను అర్థం చేసుకున్నారు. ఇది నీ జీవితం, నీకు నచ్చిన విధంగా ఉండొచ్చు అని సలహా ఇచ్చారు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

  పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణమే

  పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణమే

  నాకు కూడా ఇప్పటి వరకు ఎవరి నుండి ప్రపోజల్స్ రాలేదు. నేను పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయి ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు. ముఖ్యంగా మీడియా ఫోకస్ బాగా ఉంటుందనే భయం కూడా ఉండొచ్చు అని రేణు దేశాయ్ అన్నారు.

  చాలా కాంప్లికేటెడ్

  చాలా కాంప్లికేటెడ్

  నా విషయంలో రెండో పెళ్లి అనేది చాలా కాంప్లికేటెడ్. అందుకు సరైన సొల్యూషన్ దొరకడం కష్టమే. నాకు ఇద్దరు పిల్లలు ఉండటం కూడా అందుకు ఓ కారణం. ఇవన్నీ అర్థం చేసుకుని నన్ను ప్రేమించే వాడు దొకరడం అంత సులభం కాదు అని రేణు దేశాయ్ అన్నారు.

  నాకు ఇప్పటి నుండే ఆ వ్యక్తి మీద జాలేస్తోంది

  నాకు ఇప్పటి నుండే ఆ వ్యక్తి మీద జాలేస్తోంది

  ఎవరైనా జీవితంలోకి వస్తే... ఊహించుకుంటే అతడి మీద జాలేస్తోంది. ఎందుకంటే అతడు నాకు భర్తగా, అకీరా, ఆద్యకు స్టెప్ ఫాదర్ గా ఉండాలి. అతడు కూడా చాలా కాంప్లికేటెడ్ సిచ్చ్యువేషన్ ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకు అతడి పరిస్థితి ఊహించుకుంటే జాలేస్తుంది అని రేణు దేశాయ్ అభిప్రాయ పడ్డారు.

  లూజ్ టాక్ వస్తుంది

  లూజ్ టాక్ వస్తుంది

  మన భారతీయ సమాజంలో మగాళ్లు రెండో పెళ్లి చేసుకుంటే ఎవరూ ఏమీ కామెంట్ చేయరు. అదే ఒక అమ్మాయి వెంటనే రెండో పెళ్లి చేసుకుంటే రకరకాల కామెంట్ష్ చేస్తారు. చూసారా ఆ అమ్మాయి ఎంత పాస్ట్ గా ఉందో... అంటూ లూజ్ టాక్ చేస్తాను అని రేణు దేశాయ్ అన్నారు.

  English summary
  Pawan Kalyan's Ex wife Renu Desai Reacts on Her Second Marriage. "I was very clear on my marriage till last year that I shouldn't marry again. I had enough of marriage in my life. But I started thinking slowly.. why not ? So I've opened up my options. I'm getting myself emotionally ready for a second relatio
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more