సచ్చే దాకా ఆయనే అనుకున్న, నో రెండో పెళ్లి : రేణు దేశాయ్
హైదరాబాద్: ఆయనతో(పవన కళ్యాణ్) విడిపోయిన తర్వాత.....ఒంటరిగా, లోన్లీగా ఎంతకాలం ఉంటావు. మరో పెళ్లి చేసుకోవాలని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. 19 సంవత్సరాలపుడు ఆయన్ను ప్రేమించాను. అమ్మాయి పెళ్లి కాకుండా ఎవరితోనో సహవాసం అంటే అంటే ఎవరి పేరెంట్స్ అయినా బాధ పడతారు. అపుడు మా ఇంట్లో వాళ్లను ఒప్పించాను. అబ్బాయి(పవన్ కళ్యాన్) మంచోడు అని చెప్పి ఒప్పించాను. పరిస్థితి వారికి వివరించాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. అప్పుడే అనుకున్నాను. సచ్చేదాకా ఒకే వ్యక్తితో ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. రెండు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక రోజు ప్రేమించాను, ఈ రోజు ప్రేమించడం లేదు అని చెప్పడం నాకు తెలియదు అన్నారు రేణు దేశాయ్.
నా జీవితం ఇలా ఎందుకయింది అని తెలుచుకుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. లోన్లీగా ఎంత కాలం ఉంటావని అడుగుతున్నారు. అన్నీ అలవాటు చేసుకుంటున్నాను. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. నేను ఇపుడు ఖాళీగా ఉండటం లేదు. నాకంటూ పని ఉంది. పిల్లలు ఉన్నారు. కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అన్నారు రేణు దేశాయ్. ఇప్పటికీ ఆయన నాకు మంచి ఫ్రెండుగా ఉన్నారు అని తెలిపారు.
పేరెంట్స్ విడిపోతే పిల్లలపై ఆ ఎఫెక్టు తప్పుండా పడుతుంది. కానీ మా పిల్లల విషయంలో మాత్రం అలా జరుగలేదు. మేమెప్పుడూ గొడవ పడలేదు. మేము విడిపోవడం అనేది విచిత్రంగా జరిగిపోయింది అన్నారు. నా చేతిపై లోటస్ టాటూ చూసి అంతా నన్ను బీజేపీలో చేరుతున్నానేమో అని అనుకున్నారు. కానీ అది నిజంకాదు. నా చేతిపై ఉన్న లోటస్ టాటూ బుద్దిజంకు సంబంధించినది అన్నారు రేణు దేశాయ్.



Click it and Unblock the Notifications











