కేవలం దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం చేతిలో.. రేణూ దేశాయ్ వీడియో వైరల్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో సంధించే ప్రశ్నలకు ఒక్కోసారి సమాధానాలు ఉండవ్. ప్రకృతిని నాశనం చేయడం, అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడంపై రేణూ దేశాయ్ స్పందించే తీరుకు అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. సమాజంలో జరిగే అన్యాయాలపై ఎప్పటికప్పుడు రేణూ దేశాయ్ స్పందిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో అందరికీ అవగాహన కలిగేలా వీడియోలు, పోస్ట్‌లు చేస్తుంటుంది.

సోషల్ మీడియాలో అలా..
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే పర్సనల్ విషయాలను గురించి ఎంతలా అప్డేట్ ఇస్తుంటుందో.. సామాజిక సమస్యలపైనా అంతే స్థాయిలో స్పందిస్తుంటుంది. ఆ మధ్య చెట్లను కొట్టేసి బిల్డింగ్స్ కట్టడం, ప్రకృతిని నాశనం చేయడం, కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించడం వంటి వాటిపైన పోస్ట్‌లు పెట్టింది.

ఆ మధ్య కాశీయాత్ర..
రేణూ దేశాయ్ ఆ మధ్య కాశీ యాత్రకు వెళ్లింది. అక్కడి విశేషాలను చెబుతూ దైవ భక్తిని చాటుకుంది. గంగానది పుణ్యస్థానాలు, అక్కడి ఘటికలను వివరిస్తూ వీడియోలను షేర్ చేసింది. అయితే తాజాగా రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

స్పెషల్ ఇంటర్వ్యూ..
మామూలుగా రేణూ దేశాయ్ కెమెరా ముందుకు ఎక్కువగా రాదు. కొన్ని సందర్భాల్లోనే ఇంటర్వ్యూలు ఇస్తుంటుంది. అలా తాజాగా రేణూ దేశాయ్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన చిన్న ప్రోమో ఒకటి బయటకు వచ్చింది.
Recommended Video

దేవాలయాలు మాత్రమే..
ఆ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. మసీదులు, చర్చిలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటాయ్.. కానీ ఒక్క దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయ్.. అదెలా లౌకిక దేశం అవుతుంది.. అయితే మసీదులు, చర్చిలు ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాలని నేను అనడం లేదు.. కానీ దేవాలయాలను కూడా అలానే చేయొచ్చు కదా? అని అంటూ రేణూ దేశాయ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











