బుద్ది లేని చెత్త ప్రశ్నలు అడగొద్దు: రేణు దేశాయ్ అసహనం, బిగ్ బాస్ షోపై కూడా...
Recommended Video
నటి, దర్శకురాలు, రచయిత, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అటు తన ప్రొఫెషన్, పిల్లల పెంపకంలో బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా అభిమానులతో లైవ్ చాట్ చేస్తుంటారు.
ఇటీవలరేణు దేశాయ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు చెత్త ప్రశ్నలు అడిగ్గా... వారికి తగిన సమాధానం ఇచ్చారు.

తెలుగు గడ్డపై ఉంటే తెలుగు మాట్లాడాలి
మీరు తెలుగు చాలా క్యూట్‌గా మాట్లాడతారు మేడం అని ఓ అభిమాని కామెంట్ చేయగా.... ‘తెలుగు నాకు పూర్తిగా రాదు. సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాను. మాట్లాడుతుంటే ఏదైనా తప్పు దొర్లుతుందనే భయం ఉంటుంది. అందుకే చాలా ఆలోచించి మాట్లాడతాను. మనం ఏ ఊరిలో ఉంటే ఆ భాష మాట్లాడాలి, రోమ్ లో ఉంటే రోమన్‌లా.. తెలుగు గడ్డపై ఉంటే తెలుగు మాట్లాడాలి అనేది నా పాలసీ.' అని రేణు దేశాయ్ తెలిపారు.

మీరు డైరెక్ట్ చేసే మూవీలో యాక్ట్ చేస్తున్నారా?
నేను నటించడం లేదు, కేవలం డైరెక్షన్ మాత్రమే చేస్తున్నాను. నేనే సొంతగా కథ రాసుకుని డైరెక్షన్ చేస్తున్నాను. ప్రస్తుతానికి నటించే ఉద్దేశ్యం లేదు. ఇక మంచి రచయితగా, దర్శకురాలిగా, టక్నీషియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఉందని రేణు దేశాయ్ తెలిపారు.

మీకు బుద్ది లేదు, ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగొద్దు
ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న రేణు దేశాయ్‌కు కోపం తెప్పించింది. అయితే అతడు ఏం అడిగారో చెప్పలేదుకానీ, అలాంటి ప్రశ్న అడిగిన ఆ వ్యక్తిపై రేణు విరుచుకుపడింది. ‘మీకు అసలు బుద్ది లేదు, లైవ్‌లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారా? కాస్త ఆలోచించండి, మీ లాంటి వారు బుద్ది లేకుండా వచ్చేస్తారు. ఏదో చెత్త విషయాలు అడుగుతారు.' అంటూ విరుచుకుపడింది.

బిగ్ బాస్ షోకి రావొచ్చుగా మేడం...
నేను బిగ్ బాస్ లాంటి షోలో పాల్గొనే పర్సన్ కాదు. నాకు ఎప్పుడూ కెమెరా ముందు ఉండటం ఇష్టం ఉండదు. మీతో లైవ్ కూడా రెండు మూడు నెలలకు ఒకసారి చేస్తాను. నేను చాలా షై పర్సన్. అయినా నా పిల్లలను వదిలి ఒక్క రోజు కూడా ఉండలేను. అలాంటిది వంద రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండటం అంటే అసాధ్యం. ఒక్క రోజు గెస్టుగా రమ్మని చెప్పినా నేను వెళ్లను... అని రేణు దేశాయ్ తెలిపారు.

మాకు హాలిడేస్ ఏమీ ఉండవు
డాక్టర్ల మాదిరిగానే సినిమా వాళ్లకు హాలిడేస్ ఉండవు. ఎప్పుడు షూట్ ఉంటే అప్పుడు వెళ్లాలి. కొన్ని సార్లు బర్త్ డేలు, పండగల రోజు కూడా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మేము పనిలోనే అన్నీ ఆనందాలు చూసుకుంటాం... అని రేణు దేశాయ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











