twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదాస్పద కార్యక్రమానికి...రేణు దేశాయ్ మద్దతు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత రేణు దేశాయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారం అవుతున్న వివాదాస్పద కార్యక్రమం ‘ఆల్ ఇండియాన బక్‌చోద్'(AIB)కు తన మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వాడే బాష మరీ పచ్చిగా పచ్చిగా అభ్యంతర కరంగా ఉందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రేణు దేశాయ్ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశం అయింది.

    మద్దతు తెలపడంతో పాటు ఆమె కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేసారు. గణపతి ఉత్సవాల్లో చిన్న పిల్లల ముందు ‘శీలాకి జవానీ' లాంటి పాటలు వేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఇలాంటి షోలపై మాత్రం లాంగ్వేజీ బాగోలేదని తెగ అభ్యంతరాలు చెప్తారని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరినైనా వేలెత్తి చూపే ముందు మూడు వేళ్లు మనల్ని చూపిస్తాయనే విషయం మరిచిపోవద్దని ఆమె అంటున్నారు.

    దీంతో పాటు మహిళ రక్షణ గురించిన అంశంపై వ్యాఖ్యానిస్తూ....మీ ఏరియాలో మహిళలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగడం లేదంటే మీ ఏరియా వారంతా మహిళలను తమ సొంత సోదరీ మణుల్లా ట్రీట్ చేస్తున్నట్లే లెక్క. ఇది ఒక మంచి పరిణామం అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Renu Desai backs AIB

    ఆ సంగతి పక్కన పెడితే రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ‘ఇష్క వాలా లవ్' ఇంకా విడుదలకు నోచు కోవడం లేదు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్', కొడుకు పేరు మీద ‘అకీరా ఫిల్మ్స్' అనే సినీ నిర్మాణ సంస్థలను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్న రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

    ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. గతేడాది అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించినా....ఇప్పటికీ విడుదల కాలేదు.

    English summary
    Renu Desai came in support of the controversial show 'All India Bakchod' (AIB) which was being targeted for using explicit language in the AIB Knockout.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X