twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేణూ దేశాయ్‌ను కూడా రంగంలోకి దించింది.. సుమ ప్లాన్స్ మామూలుగా లేవు!

    |

    సోషల్ మీడియాలో సుమ చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య సుమ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. కనబడిని ప్రతీ ఒక్కరినీ మాస్క్ పెట్టుకోమని వాయించేస్తుంది. కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తూ.. మాస్క్ ధరించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ వస్తోంది. ఇక ఇప్పటి వరకు సుమ బుల్లితెరపై చేసే సందడి మాత్రమే చూస్తూ వచ్చాం. కానీ ఇంట్లో ఎలా ఉంటుందో లాక్డౌన్ వల్ల తెలిసిపోయింది.

    లాక్డౌన్‌లో రచ్చ..

    లాక్డౌన్‌లో రచ్చ..

    సుమ ఈ లాక్డౌన్‌లో రచ్చ రచ్చ చేయడం ప్రారంభించింది. ఇంట్లో ఎలా సాధారణ గృహిణిలా ఉంటుందో చూపించింది. ఇంట్లో వంటగదిలో వెరైటీ వంటకాలు చేసుకుంటూ, బోళ్లుబొచ్చలు తోముకుంటూ సుమ సరదాగా వీడియోలు షేర్ చేస్తూ వచ్చింది. అంతేకాకుండా తన పెట్ జోరోను ఓ రేంజ్‌లో భయపెట్టి విసిగించేసింది.

    యూట్యూబ్‌లో అలా..

    యూట్యూబ్‌లో అలా..

    యట్యూబ్‌లో సుమక్క పేరుతో ఓ చానెల్‌ను ప్రారంభించింది సుమ. చానెల్ పెట్టిన కొద్ది రోజులకే అది బాగా పాపులర్ అయింది. ఆ చానెల్‌లో సుమ వెరైటీ ప్రోగ్రాంలను చేస్తోంది. అందులో ఈట్ టాక్ అనే షో ఒకటి ఉంది. గెస్ట్‌లను ఇంటికి పిలిపింది.. ఏదో ఒక స్పెషల్ వంటకాన్ని వండమని చెబుతుంది.

    వారంతా రచ్చ..

    వారంతా రచ్చ..

    సుమ నడిపించే ఈ ఈట్ టాక్ షోలో సుధీర్, ప్రదీప్ చేసిన రచ్చ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సుధీర్‌తో పులిహోర చేయించిన సుమ.. ప్రదీప్‌తో మ్యాగీ వరకే సరిపెట్టుకుంది. తనకు వంటలు రావని చెబుతూ మ్యాగీని ప్రిపేర్ చేశాడు. ఆ వంటలు అయ్యే లోపు వారిని చిత్ర విచిత్రమైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది.

    Recommended Video

    Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
    రేణూ దేశాయ్‌తో..

    రేణూ దేశాయ్‌తో..

    అయితే తాజాగా రేణూ దేశాయ్‌ని కూడా ఈ షోకి ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్ జరిగినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మేరకు సుమ, రేణూ దేశాయ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక వేళ రేణూ దేశాయ్ ఈట్ టాక్ షోకి వస్తే రచ్చ రచ్చ అవుతుంది.

    English summary
    Renu Desai Chief Guest for Suma EAT Talk Show,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X