For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అకీరా సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ: ఇప్పుడదే పనిలో ఉన్నాడు.. అప్పుడే చెబుతానంటూ కామెంట్

  |

  రేణు దేశాయ్.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈమె కొంత కాలంగా హాట్ టాపిక్ అవుతున్నారు. సినిమా నటిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈమె.. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌ను పెళ్లాడడం.. విడాకులు తీసుకోవడం వంటి వాటితో హైలైట్ అయిపోయారు. ఇక, ఈ మధ్య తరచూ ఏదో ఒక పని చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్ ఆమెను కొడుకు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించారు. దీనిపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   అలా పరిచయం.. పెళ్లి కూడా జరిగింది

  అలా పరిచయం.. పెళ్లి కూడా జరిగింది

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘బద్రీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు రేణు దేశాయ్. అందులో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈమె.. ఆ మూవీ సమయంలోనే పవన్‌తో ప్రేమలో పడిపోయారు. అప్పుడు ‘జేమ్స్ పాండూ' అనే తమిళ చిత్రంతో పాటు ‘జానీ'లో నటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వివాహం చేసుకుని సినిమాలకు దూరమైపోయారు.

   రేణు దేశాయ్... సినిమా ఆల్‌రౌండర్‌గా

  రేణు దేశాయ్... సినిమా ఆల్‌రౌండర్‌గా

  నటిగా చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా రేణు దేశాయ్ మంచి గుర్తింపును అందుకున్నారు. యాక్టింగ్‌కు దూరమైనప్పటికీ పలు విభాగాల్లో పని చేస్తూ వచ్చారామె. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసిన ఆమె.. కొన్ని పాటలకు ఎడిటర్‌గానూ పని చేశారు. తద్వారా సినిమా ఆల్‌రౌండర్‌గా గుర్తింపును కూడా అందుకున్నారు.

  సెకెండ్ ఇన్నింగ్స్ కూడా మొదలెట్టింది

  సెకెండ్ ఇన్నింగ్స్ కూడా మొదలెట్టింది

  పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నేళ్ల పాటు పుణెలో ఉన్నారు రేణు. ఈ క్రమంలోనే ‘ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమా నిరాశ పరచడంతో దర్శకత్వం వైపు చూడలేదు. కానీ, కొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు స్వయంగా వెల్లడించారామె.

  బుల్లితెరపైనా రేణు దేశాయ్ హంగామా

  బుల్లితెరపైనా రేణు దేశాయ్ హంగామా

  కొద్ది రోజుల క్రితమే రేణు దేశాయ్ తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలోనే పలు షోలకు జడ్జ్‌గా పని చేశారు. అలా టెలివిజన్ ప్రేక్షకులను సైతం అలరించారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రారంభం అయిన ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' పేరిట ఐదో సీజన్‌‌లో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, సింగర్ సునీతతో కలిసి రేణు దేశాయ్‌ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు.

   అందులో మాత్రం ఫుల్ బిజీగా ఉంటూ

  అందులో మాత్రం ఫుల్ బిజీగా ఉంటూ

  సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఎంతో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. అందులో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ సంబంధించిన విశేషాలను తరచూ ప్రస్తావిస్తుంటారు. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. రేణు దేశాయ్ ఇప్పటికే కొన్ని లక్షల ఫాలోవర్లను సంపాదించారు.

  అకీరా నందన్ గురించి అడిగిన ఫ్యాన్స్

  అకీరా నందన్ గురించి అడిగిన ఫ్యాన్స్

  తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం భారీగా పెరగడంతో.. ఏదైనా సమస్య ఉన్నవాళ్లు తన దృష్టికి తీసుకొస్తే.. ఏదొక సహాయం చేస్తానని రేణు దేశాయ్ ఇటీవల ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పలువురు బాధితుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు కొందరు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రశ్నించారు.

  Netizen కి Renu Desai పవర్ పంచ్, పోయి వాళ్ళని అడుగు అంటూ ఆగ్రహం!! || Filmibeat Telugu
  ఇప్పుడా పనిలో.. అప్పుడే చెబుతానని

  ఇప్పుడా పనిలో.. అప్పుడే చెబుతానని

  అకీరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా పిల్లలు కరోనా నుంచి కాపాడుకోవడం కోసం ఇంట్లోనే ఉంటున్నారు. అందరూ అదే పని చేయండి. అలాగే, అకీరా సినిమా ఎంట్రీ గురించి చెప్పే సమయం ఇది కాదు. కోవిడ్ గురించి అందరూ భయపడుతున్న పరిస్థితుల్లో నేనేమీ చెప్పలేను. కానీ, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతా' అంటూ వెల్లడించారామె.

  English summary
  Renu Desai is Very Active in Social Media. Recently Fans Ask her to Tell about Akira Nandan Tollywood Entry. Then She Clarified About it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X